Yashoda Review: యశోద రివ్యూ

Yashoda Review: యశోద రివ్యూ

విడుదల తేదీ : నవంబర్ 11, 2022

నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, తదితరులు

నిర్మాణ సంస్థ : శ్రీదేవి మూవీస్

నిర్మాతలు : శివలెంక కృష్ణ ప్రసాద్

దర్శకత్వం : హరి హరీశ్

సంగీతం : మణిశర్మ

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

సినిమాటోగ్రాఫర్ : సుకుమార్

ఈ వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులకు అంతోఇంతో ఆసక్తిని కలిగించిన సినిమా ఏదనే ప్రశ్నకు యశోద సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. సమంతను నమ్మి ఈ సినిమా నిర్మాత ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఈ సినిమాకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరిగింది. సమంత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కథ :

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి వాళ్లను సరోగసి తల్లులుగా కొంతమంది మారుస్తుంటారు. పిల్లలు పుట్టని ధనవంతుల కోసం ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటారు. అయితే యువతుల్ని సరోగసి తల్లులుగా మార్చే ల్యాబ్ నిర్వాహకులు ఒక పెద్ద మాఫియాతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటారు. సరోగసి పేరుతో అక్కడ జరుగుతున్న ఆకృత్యాలు యశోదకు తెలిసి ఆమె ఏం చేసింది? ఆ మాఫియా సామ్రాజ్యానికి యశోద ఏ విధంగా చెక్ పెట్టింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

విశ్లేషణ :

యశోద మూవీలో స్టార్టింగ్ సన్నివేశాలు నిదానంగా మొదలైనా నెమ్మదిగా పుంజుకుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో ఫస్టాఫ్ ఒక విధంగా ఉండగా సెకండాఫ్ మరో విధంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించడంలో హరి హరీశ్ ఫెయిలయ్యారు. ఏ సెంటర్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చేలా ఈ సినిమా ఉంది. సమంత కెరీర్ లో యశోద మంచి సినిమాగా నిలిచే ఛాన్స్ ఉండగా కమర్షియల్ గా ఈ సినిమా రేంజ్ తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఈ సినిమా ఉండగా టైటిల్ మరీ సాఫ్ట్ గా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.

సాంకేతిక నిపుణుల పనితీరు

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సుకుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సమంత మార్కెట్ ను మించి ఉన్నాయి. ఈ వారం మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ప్లస్ పాయింట్స్ :

సమంత నటన

హరి, హరీశ్ డైరెక్షన్

కథ, కథనం

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం

ఎడిటింగ్

సమంత అభిమానులకు మాత్రమే నచ్చే యశోద

రేటింగ్ : 3/5

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: వివేకానంద రెడ్డి హత్యలో జగన్ భార్య భారతి ప్రమేయం.. రఘురామ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Raghurama Krishnamraju: నరసాపురం ఎంపీ టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఆయన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలు విషయాలపై చర్చించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ ఈ...
- Advertisement -
- Advertisement -