Jagan: వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేర్లలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఒకటి. ఈయన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా వైసిపి అభ్యర్థికి వేయాల్సిన ఓటును క్రాస్ చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.అయితే ఇది నిజమని నిరూపించిన తర్వాత వైసిపి అధిష్టానం ఈయనపై సస్పెన్షన్ వేటు వేసింది.ఇలా ఈయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా అధికార పార్టీ కొరడా జులిపించింది.

 

ఇక పార్టీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కొన్ని క్షణాల ముందు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం వైసిపి నాలుగు వర్గాలుగా విభజించి అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం కోసం అధిష్టానంలో మాట్లాడే నాథుడే లేరని ఈయన ఆవేదన చెందారు.

ఇక గ్రామ సచివాలయాలకు వెళ్లి ఏ అధికారిని కదిలించిన నిధులు లేవనే సమాధానం చెబుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఆయనకు పేరు వస్తుంది కానీ ఎమ్మెల్యేలకు రాదని నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినప్పుడే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పరిస్థితి ఇదేనని ఈయన వెల్లడించారు.

 

ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కనుక మారకపోతే తన పార్టీ భూస్థాపితం అవుతుందంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వైసీపీ అధిష్టానం చెప్పిన జ‌య‌మంగ‌ళ‌ వెంకటరమణకే ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించానన్నారు. ఇక తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని లేకపోతే తన దారి తాను చూసుకుంటానంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -