YS Jagan: జగన్ కు మరో ఛాన్స్ ఇవ్వాలంటున్న వైసీపీ ఎమ్మెల్యే.. ఏం చెప్పారంటే?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీలో వణుకు మొదలైంది అంటూ ప్రస్తుతం వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏకంగా వైసీపీ నేతలు, వైసీపీలో ఉన్న పార్టీ నాయకులు ఆ పార్టీ గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ పాలన ఘోరమని అంటుండగా జగన్ తీరు అత్యంత ఘోరంగా ఉందని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్యకాలంలో జగన్లో జగన్ మాటతీరులో వచ్చిన మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని అంటున్నారు.

ఇకపోతే తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఇదే విషయం గురించి స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్న మాట వాస్తవమే. అందుకు కారణం జగన్‌కు అనుభవం లేకపోవడమే అని ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలతో ఎలా వుండాలన్న దానిపై జగన్ అనుభవం లేదంటున్నారు. కానీ రెండోసారి సీఎంగా జగన్ కి అవకాశమిస్తే పూర్తి అవగాహన వస్తుందని సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. సాయి ప్రసాద్ మాటలు వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వ పనితీరు నాసిరకంగా ఉందని, అంతా నాశనం చేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్ కు అనుభవం లేనందునే ఇలా జరిగిందని మరోసారి అవకాశం ఇవ్వమని అనుభవంతో బాగా పరిపాలిస్తామని ప్రచారం చేసుకోవాలన్న వ్యూహతో ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనుభవం లేకనే రాష్ట్రాన్ని కూడా నాశనం చేశారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఒక అవకాశం ఇచ్చి తప్పు చేసాము మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయాలనుకోవడం లేదు. మరో అవకాశం ప్రజలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో నేర్చుకోని జగన్ తర్వాత ఏం నేర్చుకుంటారని ప్రశ్నలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలన్నది అనుభవంతో వచ్చేది కాదని. మనస్థత్వాన్ని బట్టి ఉంటుందని వైసీపీలోనే చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల అవసరం ఉన్నప్పుడు వారిని బాగా చూసుకుని అవసరం లేనప్పుడు కనీసం పట్టించుకోని వ్యక్తిత్వాలకు అనుభవంతో ఏం పని ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -