YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌లో వైఎస్ఆర్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌జ‌లకు చేసిన మేలును గుర్తు చేస్తూ.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్ర‌క‌టించిన ముంద‌స్తు మేనిఫెస్టో పై విమ‌ర్శ‌లు గుప్పించారు.


ఎన్నిక‌ల‌కు ముందు ఆక‌ర్ష‌ణీయ‌మైన మేనిఫెస్టో అంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మంచి ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను వెన్నుపోటు పొడ‌వ‌డం బాబుకు బాగా అల‌వాటు. క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌ మేనిఫెస్టోల‌ను క‌లిపి బిస్మిల్లా బాత్ వండేశారు. అలాగే వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారంటూ ఎద్దేవా చేశారు జగన్. బాబుకు ఒరిజినాలిటీ, ప‌ర్స‌నాలిటీ, క్రెడిబిలిటీ అనేది లేదంటూ మండి పడ్డారు. పిల్ల‌వాడైన కృష్ణుడిని చంప‌డానికి వ‌చ్చిన పూత‌న అనే రాక్ష‌సి, మారీచుడు, రావ‌ణుడు క‌లిస్తే చంద్ర‌బాబు అంటూ సంచలన వాఖ్యలు చేశారు.

 

సొంత మామ‌నే వెన్నుపోటు పొడిచి చంపేసిన మ‌నిషి తిరిగి ఆయ‌న‌కు దండ‌లు వేసి కీర్తిస్తూన్నరంటూ మండిప‌డ్డారు జగన్. చంద్ర‌బాబు సీఎంగా ఉంటే రాష్ట్రం క‌రువుతో తాండ‌వించేదని, వైసీపీ అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి మంచిగా వర్షాలు ప‌డుతున్నాయి అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులు లాగ నిలబడండి అంటూ మీ బిడ్డ నమ్ముకుంది దేవుని దయ మీ దీవెన‌లు మాత్రమే అని తెలిపారు జగన్.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Nomination: చంద్రబాబు నాయుడు నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఈ విధంగా జరగబోతుందా?

Chandrababu Nomination: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ విజయం అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏడుసార్లు కుప్పం నుంచి పోటీ చేయగా...
- Advertisement -
- Advertisement -