YCP: వైసీపీ నేతల రౌడీయిజానికి మహిళ ఆత్మహత్య!

YCP: ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించే వారినే ప్రజాప్రతినిధులు అంటారు. అది ఒకప్పటి మాట. కానీ.. ఇప్పుడు ప్రజల ద్వారానే ఎన్నికై వారిపై పెత్తనం చెలాయిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. కొందరు చేసే ఆగడాలను తట్టుకోలేక కొందరు అమాయకులు ప్రాణాలు సైతం వదులుకుంటున్నారు. తాజాగా వైసీపీ నాయకులు వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాజ జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు, కడియాల అచ్చమ్మ (36) తోబుట్టువులు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి రెండు సెంట్ల స్థలాన్ని సోదరి అచ్చమ్మకు బహుమానంగా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత  అచ్చమ్మ స్థలానికి వైసీపీ నాయకులకు మధ్య గొడవ మొదలైంది. అలా కొన్ని రోజులు జరగ్గా వైసీపీ నాయకులు రోజురోజుకు భయాందోళనకు గురిచేయడంతో రెండు నెలల క్రితం సోమేశ్వరరావు పురుగుల మందు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

 

కొన్ని రోజుల తర్వాత అచ్చమ్మకు సంబంధించిన 2 సెంట్లను వుడా లేఅవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించామని, 15 రోజుల్లో ఖాళీ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి  నాగప్రభు ఈ నెల 2న నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నప్పటి నుంచి అచ్చమ్మ తీవ్ర మనోవేదనకు గురవుతూ వచ్చింది. ఎన్ని కార్యాలయాలు, అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అచ్చమ్మ రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మతదేహాన్ని గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక సీఐ గోలగాని అప్పారావు, ఎస్సై రాంబాబు, సిబ్బందితో కలిసి అర్ధరాత్రి గోవిందపురం చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.

అచ్చమ్మ డెడ్‌బాడీని తీసుకురాగా భర్త చిన్నారావు, సోదరుడు భీమేశ్వరరావు చూసేందుకు ప్రయత్నిస్తుంగా పోలీసులు వారిని గట్టిగా తోసేసి మృతదేహాన్ని అంబులెన్స్‌లో పెట్టించారు. అక్కడే ఉన్న స్థానికులు ఆగ్రహానికి గురై అంబులెన్స్‌ను ముందుకు కదలకుండా కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్చీ చేయగా అంబులెన్స్‌ డ్రైవర్‌ వేగంగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఎస్సై కాలిపై వెళ్లగా కాలు విరిగిపోయింది.  ముదపాక గ్రామంలో ల్యాండ్‌ పూలింగ్‌ అక్రమాలకు అడ్డుపడుతున్నారని సోమేశ్వరరావు, భీమేశ్వరరావు కుటుంబంపై వైసీపీ నాయకులు కక్ష కట్టారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నిలదీయడంతో ఎట్టకేలకు రసీదు ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు సారిపల్లి గణేష్, సియ్యాద్రి బాలచంద్ర,  ఇప్పిలి కనకరాజు పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -