Yandamuri Veerendranath: యండమూరి వీరేంద్రనాథ్ ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. యండమూరి రాసిన చాలా నవలలు చదివే వారిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. ఈయన వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ కొంతకాలం ఉద్యోగం చేసి, పూర్తిస్థాయి రచయితగా మారడానికి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
యండమూరి రాసిన నవలలలో సినిమాలుగా అభిలాష, చాలెంజ్, ఆఖరి పోరాటం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, రాక్షసుడు లు చెప్పుకోదగినవి. అంతేకాకుండా ఈయన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడం.. నటుడిగా కూడా రెండు మూడు సినిమాలలో నటించడం జరిగింది. యండమూరి కొన్ని సినిమాలకు మాటల రచయితగా కూడా వ్యవహరించారు.
ఇలా తన కెరీర్లో బిజీగా సాగుతున్న యండమూరి ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో గతంలో మీరు రామ్ చరణ్ పై కామెంట్ చేశారు కదా అనే ప్రశ్న ఎదురయింది. అందుకు సమాధానంగా తాను ఏ కామెంట్ చేయలేదని రామ్ చరణ్ తన ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్న విషయం గురించి క్యాజువల్ గా మాట్లాడిన మాటలను నెగటివ్ గా ప్రచారం చేశారు.
తనకు చిరంజీవి చాలా సన్నిహితుడని ఆ చనువుతో అలా అన్నాను కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. తామంతా చాలా క్లోజ్ గా మాట్లాడుకునే వారంటూ తెలుపుతూ, ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. క్యాజువల్ గా మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారని పేర్కొనడం జరిగింది.
ఇక గతంలో అశ్వినిదత్ శక్తి సినిమా కథ వినిపించాడు. తర్వాత తాను కథలో రెండు మూడు చిన్న చిన్న మార్పులు చేసి సినిమా తీస్తే బాగుంటుంది అనడం జరిగింది. కానీ అశ్వినిదత్ మార్పులు ఏమి చేయకుండా అలాగే సినిమా తీయడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఈమధ్య వచ్చిన సీతారామం సినిమా కథ కూడా ముందుగానే తనకు వినిపించడం జరిగిందని తెలిపాడు.