Lose Weight Easily: వీటిని తింటే ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు.. ఏం తినాలో తెలుసా?

Lose Weight Easily: చాలా మంది బరువు తగ్గాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎలాంటి డైటింగ్‌ లేకుండా ఇలాంటి ఆహార పదర్థాలు తీసుకుంటే సులువుగా బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్‌టీ: గ్రీన్‌ టీ ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చాలా సార్లు విన్నాం. అయితే గ్రీన్‌ టీని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చా అంటే బరువు తగ్గాలంటే గ్రీన్‌ టీ చాలా బాగా పని చేస్తుంది. గ్రీన్‌ టీలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఇది బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే గ్రీన్‌ టీ తాగడం వల్ల మెటబాలిజం కూడా బూస్ట్‌ అవుతుంది రెగ్యులర్‌గా గ్రీన్‌ టీ తీసుకుంటే క్యాలరీలను తగ్గించుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కచ్చితంగా గ్రీన్‌ టీ ని తీసుకుంటే బరువు తగ్గడానికి వీలవుతుంది.

సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ (బీఎంఐ) ఉంటే బరువు తగ్గడం మంచిది. ఎందుకంటే ఎక్కువ బరువు వున్నా సరే ఇబ్బందులు వస్తాయి. అయితే తాజాగా చేసిన పరిశోధన ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల చక్కటి ప్రయోజనాలు ఉన్నాయని… ఇది బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

బ్లాక్‌టీ: గ్రీన్‌ టీ మాదిరిగానే బ్లాక్‌ టీ కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే గ్రీన్‌ టీ లానే బ్లాక్‌ టీ కూడా పని చేస్తుంది. ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటంటే ఆక్సిడేషన్‌ ప్రాసెస్‌. ఇది ఇలా ఉంటే బ్లాక్‌ టీని కూడా మీరు నిరంతరంగా తీసుకుంటే బరువు తగ్గడానికి వీలవుతుంది. ఇలా బ్లాక్‌ టీతో కూడా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే సులువుగా బరువు కూడా తగ్గవచ్చు.

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని అనేక ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉన్నారు. ప్రజలకి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మహమ్మారి సమయంలో తెలిసింది. అయితే బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్లు బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బాగా బరువుగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది మహమ్మారి సమయంలో చాలా మంది గ్రహించారు. అయితే నిపుణులు కూడా ఈ రోజు బరువు గురించి, బరువు తగ్గడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి కూడా చెప్పారు. బాదం పప్పులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది ఆకలి దప్పికను కలిగించదు కాబట్టి వేగంగా బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

సొరకాయ, బాదం పప్పు: సొరకాయ శరీర బరువు తగ్గడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో వివిధ రకాల ప్రొటీన్లు, విటమిన్లు మరియు లవణాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు, లాక్టోస్‌ ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు తింటే బరువు కూడా తగ్గుతారు. పెరుగు తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఆహారంలో నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించాలి. ఇది శరీరానికి శక్తిని అందించడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -