PM Modi: 5 కోట్ల మంది ప్రజలను మీరే కాపాడాలి.. ప్రధాని అలా చెప్పారా?

PM Modi: తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మాదిరిగానే మారింది అని ఆయన తెలిపారు. ఏపీలో రోజురోజుకీ శాంతిభద్రతలు క్షీణించిపోతున్నాయి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలోనే మోడీ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ కనకమేడల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మోదీ ఆరా తీశారు. ఇక ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను కనకమేడల ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ గురించి అన్ని విషయాలు తనకు తెలుసని మోదీ అన్నారు. అన్ని విషయాల్లో ఏపీ పంజాబ్‌లా తయారైందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్ధిక, శాంతి భద్రతల పరిస్థితులు తన దృష్టిలో ఉన్నాయని ప్రధాని తెలిపారు. అలాగే 5 కోట్ల రాష్ట్ర ప్రజలను మీరే కాపాడాలని ప్రధాని మోదీని ఎంపీ కనకమేడల కోరారు.

కనకమేడల విజ్ఞప్తి మేరకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయం తన దృష్టికి తీసుకువచ్చినట్టుగా మోదీ గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీ‌లో నెలకొన్న పరిస్థితులు పట్ల విచారం వ్యక్తం చేసినట్లు టీడీపీ ఎంపీ కనకమేడల తెలిపారు. ఇదే విషయాన్నీ ప్రముఖ పత్రికలో పేర్కొన్నారు. ఆ పత్రికలో ఈ విధంగా రాసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీ కనకమేడలతో ఏపీ పరిస్థితుల గురించి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారని రాసుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -