Mega Builder P.P. Reddy: పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతరాత్ర కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు అక్కడికొచ్చే ప్రబుఖులు, సెలబ్రిటీలు ఖరీదైన దస్తులు, వాచీలు, బ్యాగులు, గోల్డ్ ధరించి వస్తుంటారు. అక్కడికొచ్చిన సెలబ్రెటీలతో ఫొటోలు దిగేదుకు ఆసక్తి చూపుతారు. ఆ తర్వాత ఇంటికొచ్చి వారు ఉపయోగిస్తున్న వస్తువుల ధరలను ఆన్‌లైన్‌లో చూసి అవక్కవుతారు. ఇలాంటి ఖరీదైన వస్తువులు హీరోలు, క్రికెటర్లు పేరున్న వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ధరిస్తుంటారు. అలాంటి వస్తువులు సామాన్యలు అయితే.. ఇటీవల ఓ కాంట్రాక్టర్ ధరించిన వాచ్ ధర తెలుసుకుంటే ముక్కువ వేలేసుకోవడం ఖాయం. దాని ధర వేలల్లో ఉంటే మామూలే కానీ.. ఆ కాంట్రాక్టర్ ధరించిన ధర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 కోట్టట. ఇది నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా నమ్మాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ మేఘా పిచ్చిరెడ్డి ఆ ఖరీదైన వాచ్ ధరించాడు.
’మేఘా బిల్డర్’ అంటే ప్రస్తుతం తెలియని వారు ఉండరు. నిర్మాణ సంస్థ ఎంఈఐల్ చైర్మన్ పీపీ రెడ్డి ఏ ప్రాజెక్టు చేపట్టినా అది భారీగానే ఉంటుంది. 1987లో చిన్న పైపుల తయారీ సంస్థగా ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెంచర్లను కలిగి ఉంది. జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి దేశాలలో కూడా ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే అప్పులు లేని సంస్థగా ఎంఈఐల్ సంస్థ ఘనత సాధించింది. భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాక ఈ సంస్థ ఫోర్బ్స్ జాబితాలో కూడా చేరింది.
ఫోర్బ్స్ భారతీయ సంపన్నుల జాబితాలో అతని ర్యాంక్ 47 నుంచి 39కి చేరింది. అతను ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్–2019లో కూడా ఉన్నాడు. మరియు నిర్మాణ విభాగంలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇలా భారీగా పెరుగుతున్న సంపదతో ఆయన వాడే వస్తువులు కూడా భారీగానే ఉంటాయి. ప్రస్తుతం రూ.5 కోట్ల ఖరీదైన ఆస్ట్రోనోమియా టూర్ బిల్లాన్ వాచ్‌ను ఆయన ధరించాడు. దీనిని 18 క్యారెట్ల పింక్ గోల్డ్ తయారు చేశారు. బ్లూ డైమండ్ పొదిగి ఉంటుంది. ఈ వాచ్Ðపై తాజ్‌మహాల్, కుతుమీనార్, ఇండియా గేట్‌తో పాటు లోటస్ టెంపుల్ చెక్కారు.అత్యంత ఖరీదైన ఆ వాచ్‌ను జాకెట్ అండ్ కో కంపెనీ హ్యాండ్ మేడ్ వాచ్‌గా తయారుచేసి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.