Hyper Aadi: శ్రీలీల గురించి హైపర్ ఆది కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Hyper Aadi: మాస్ మహారాజ రవితేజ హీరోగా ధమాకా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదిన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. అయితే ధమాకా హీరోయిన్ అయిన శ్రీలీలపై హైపర్ ఆది మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

మాస్ మహారాజ రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో ధమాకా మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సినిమాలో హైపర్ ఆది ఓ పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ప్రీరిలిజ్ ఈవెంట్ లో స్టేజ్ మీదికొచ్చిన హైపర్ ఆది హీరో రవితేజ గురించి మాట్లాడిన తర్వాత హీరోయిన్ శ్రీలీలపై హాట్ కామెంట్స్ చేశాడు.

 

సినిమాలో శ్రీలీల నటన పీక్స్ లో ఉంటుందని, సాధారణంగా లవర్ లేనివాడు ఈ సినిమా చూస్తే శ్రీలీల లాంటి లవర్ ఉంటే బాగుండు అని అనుకుంటాడని ఆది అన్నాడు. లవర్ ఉన్నోడు ఈ అమ్మాయిని చూస్తే ఇలాంటి లవర్ ఉన్నా బాగుండేది అని అనుకుంటాడని తెలిపాడు. ఎవరికైనా శ్రీలీలని చూస్తే అలాగే అనిపిస్తుందని, తనకు కూడా అలాగే ఉందని హైపర్ ఆది అన్నాడు.

 

హైపర్ ఆది సినిమా గురించి మాట్లాడుతూ మంచి హిట్ అవుతుందని అన్నాడు. శ్రీలీలలాగా తెలుగులో ఇంత మంచి ఆర్టిస్ట్ దొరకడం మామూలు విషయం కాదని, రాబోయే రోజుల్లో శ్రీలీల మంచి అవకాశాలు అందుకుంటుందని అన్నారు. హైపర్ ఆది శ్రీలీలని ఆకాశానికెత్తేయడంతో అందరూ హైపర్ ఆది కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడని తెలిపారు. కాగా శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -