Roja: ప్రముఖ నటి రోజాపై వస్తున్న కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Roja: బుల్లితెరపై జబర్దస్త్ షో రారాజుగా వెలుగుతోంది. ఈ షో ఇప్పటికే ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ షో నుంచి ఎంతో మంది పాపులర్ అయ్యారు. అందులో రోజా కూడా ఉన్నారు. గతంలో రోజా స్టార్ హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత ఆమె అంతగా పాపులర్ కాలేదు. ఆ సమయంలోనే బుల్లితెరపై కనిపించి అందరికీ చేరువయ్యింది. మంచి పేరును రోజా సంపాదించుకుందని చెప్పాలి. ముఖ్యంగా జబర్దస్త్ జడ్డిగా ఆమెకు ఎంతో డిమాండ్ కూడా పెరిగింది.

 

రోజా అప్పట్లో అప్పుట్లో కూరుకుపోయిందని టాక్ ఎక్కువగా వినిపించింది. దీంతో ఆమెకు జబర్దస్త్ షో బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు జబర్దస్త్‌ షోలోనే ఆమె జడ్జిగా కొనసాగింది. ఆ షో ద్వారా తన అప్పులు మొత్తం తీరిపోయాయని చెప్పాలి. వైసీపీ సర్కార్ రోజాకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆమె జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు.

 

మంత్రి పదవి వచ్చాక రోజా జబర్దస్త్ షో గురించి అస్సలు మాట్లాడ్డం లేదు. సినిమాల గురించి కూడా అంతగా పట్టించుకోవడం లేదని చెప్పాలి. తాజాగా జబర్దస్త్ 500వ ఎపిసోడ్ జరిగింది. ఈ సందర్భంగా ఆ ఎపిసోడ్ కు ఆమె చీఫ్ గెస్ట్ గా వచ్చింది. కమెడియన్లంతా ఆమెకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. రోజా వస్తూ వస్తూనే ఆమె కమెడియన్లతో కామెడీ పంచులు వేశారు.

 

రోజా రీ ఎంట్రీపై దారుణంగా సెటైర్లు పేలడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరేమో పోయిందనుకున్న దరిద్రం మళ్లీ వచ్చిందంటూ విపరీతంగా ట్రోల్స్ చేయగా ఇంకొందరు నెటిజన్లు బూతుల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆమె షో రీ ఎంట్రీ ఆమెకు ప్లస్ అవుతుందా లేకుంటే మైనస్ అవుతుందా అనేది తెలియడం లేదు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -