Mrunal Thakur: సీతారామం బ్యూటీ పాఠాలు వింటే షాకవ్వాల్సిందే!

Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆమె ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. సినిమాల విషయంలో ప్రతి పాత్రలో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపును ఆమె తెచ్చుకున్నారు. మృణాల్ సీతారామం సినిమాలో సీత పాత్రలో ఒదిగిపోయారు. ఆమె నటనకు, అందచందాలకు ఆమెకు చాలా మంది ఫాలోవర్లు పెరిగిపోయారు.

 

ఇది వరకూ ఆమె నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే సీతారామం సినిమా మరో ఎత్తు అనే చెప్పాలి. ఆ ఒక్క సినిమా ఈ అమ్మడు జీవితాన్నే మార్చేసింది. ఆమె కెరీర్ గ్రాప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంతవరకు ఆమె ఎక్స్పోజింగ్ చేస్తే సెక్సీ అనేవారు కూడా ఇప్పుడు ఆమె అలా చేస్తే చూడలేకపోతున్నాం అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతలా ఆ పాత్రతో జనాల మదిలోకి ఈ చిన్నది వెళ్లిపోవడం విశేషం.

తాజాగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉండాలో చెప్పి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మృణాల్ చేసిన డేరింగ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.

 

హీరోయిన్స్ విషయంలో అస్సలు మొహమాట పడకూడదని, అలా ఉంటే డబ్బులు వెనకేసుకోలేం అని, వాళ్లకు కావాల్సిన విధంగా మనల్ని మార్చుకుంటున్నప్పుడు మనకు కావాల్సిన విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మన హక్కు అని ఈ హీరోయిన్ తెలిపారు. మార్కెట్ ను బట్టి వాళ్ళు ఎంత ఇవ్వాలో ఇస్తారని, మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో మొహమాట పడితే హీరోయిన్స్ ఎప్పటికీ పైకి ఎదగలేరని మృణాల్ చెప్పుకొచ్చారు. ఆమె ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడ్డం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసినా ఆమె నిజమే చెప్పిందంటూ మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మృణాల్ ఠాగూర్ డేరింగ్ హీరోయిన్ అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -