Revanth: రేవంత్ తల్లి చెప్పిన మాటలు వింటే షాకవ్వాల్సిందే!

Revanth: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్6 విన్నర్ ఎవ్వరో తెలిసిపోయింది. ఇంకెవరో కాదు రేవంతే. బిగ్ బాస్ లోకి ఆయన ఎంటర్ అయ్యాక 25వ రోజు ఓ మాట అన్నారు. ఎవరెంత నవ్వుతారో నవ్వండి..నేను బిగ్ బాస్ టైటిల్ చేతులతో పట్టుకున్నప్పుడు మీ నవ్వు ఏమవుతుందో చూస్తాను అంటూ రేవంత్ చేసిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఇప్పటికే రేవంత్ కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

బిగ్ బాస్ సీజన్6 విన్నర్ ఎవ్వరో తెలుసుకోవడానికి ఇంకొన్ని గంటలే ఉన్నాయి. ఇప్పటికే విన్నర్ రేవంత్ అంటూ లీక్ అయ్యింది. దీంతో రేవంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో ఎవరెవరికి ఏ పొజిషన్ ఇచ్చారో బయటకు వచ్చింది.

విన్నర్ గా రేవంత్, ఫస్ట్ రన్నరప్ గా శ్రీహాన్, మూడో స్థానంలో ఆదిరెడ్డి, కీర్తికి నాలుగో స్థానం, ఇక చివరగా ఐదో స్థానంలో రోహిత్ ఉన్నట్లు లీక్ అయ్యింది. నిజానికి ఈ సీజన్ విన్నర్ రేవంత్ అని ఎప్పుడో తెలిసిపోయింది. రేవంత్ చాలా సార్లు విన్నింగ్ గురించి చెప్పుకొచ్చాడు. నాగార్జున ఫినాలే రోజు పైకి ఎత్తేది తన చేయేనని తేల్చి చెప్పాడు.

 

రేవంత్‌ని విన్నర్‌ని చేసినందుకు ఆమె తల్లి సీతా సుబ్బలక్ష్మి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘మా వాడ్ని విన్నర్‌ని చేసినందుకు చాలా థాంక్స్ అంటూ వెల్లడించారు. తన కొడుకు ట్రోఫీని అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఆనందంలో తనకు భోజనం కూడా చేయబుద్ది కావడం లేదని అన్నారు. ఇలాంటి కొడుకు జన్మజన్మలకి తన కడుపునే పుట్టాలని కోరారు. సీతా సుబ్బలక్ష్మి ఫ్యామిలీ వీక్‌లో భాగంగా రేవంత్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి తన అమాయకత్వంతో అందరి మనసులను దోచుకున్నారు. అప్పటి వరకూ రేవంత్‌పై ఉన్న నెగిటివిటీని చాాలా వరకూ ఆమె తగ్గించగలిగారని చెప్పొచ్చు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -