Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ ప్లాన్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Anasuya Bharadwaj: ఇప్పుడున్న యాంకర్లలో హాట్ అండ్ రొమాంటిక్ యాంకర్ గా అనసూయ ముందు వరుసలో నిలుస్తుందనే చెప్పాలి. జబర్దస్త్ తో ఈమె పాపులర్ అయ్యింది. అయితే ఆమె ఇటీవలె ఆ షో నుంచి వచ్చేసింది. తనపై కామెంట్స్ ఎక్కువవుతున్నాయని, బాడీ షేమింగ్ పంచ్ లు తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆమె ఆ షో నుంచి బయటకు వచ్చేసింది. మరికొంత కాలం గ్యాప్ తీసుకుని మరో కొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

 

తాజాగా ఆమె నెటిజన్లతో పలు విషయాలపై చర్చించింది. తాను ఇప్పుడు చేస్తున్న సినిమాల గురించి చెప్పుకొచ్చింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఆమె ఏయే సినిమాలు చేస్తోందో వెల్లడించింది. ఆ సినిమాల లిస్ట్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఆమె చెప్పిన సినిమాల లిస్టులో టాప్ స్టార్లు అయిన పవన్, తారక్, బన్నీ వంటివారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో ఆమె హరిహరవీరమల్లు అనే సినిమాలలో నటిస్తోంది. అలాగే బన్నీతో కలిసి పుష్ఫ2 సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 

పుష్ఫ2 సినిమాలో అనుసూయ ఎక్కువగా కనిపించనుంది. ఇకపోతే ఎన్టీఆర్ తో కలిసి ఎప్పుడు నటిస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా దానికి సమాధానం ఇచ్చింది. త్వరలోనే ఎన్టీఆర్ తో కలిసి నటిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కొరటాల శివ సినిమాలో నటించనుందని తెలుస్తోంది.

 

ఈ సినిమాలే కాకుండా రంగమార్దాండ, ఛేజ్, ఫ్లాష్ బ్యాక్, వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇందులో కొన్ని సినిమాలు తమిళంలో కూడా విడుదల కానున్నాయి. విజయ్ సేతపతితో ఓ సినిమాలో కూడా ఈమె కనిపించనుంది. సందీప్ కిషన్ తో మైఖేల్ అనే పాన్ ఇండియాా సినిమాలో కూడా నటిస్తోంది. సింబా, అరి అనే మరో రెండు తెలుగు, తమిళం సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. అంతేకాదు మలయాళం సినిమాలోకూడా చేయబోతోంది. దీంతో మొత్తంగా ఇప్పుడు అనసూయ చేతిలో మొత్తం 12 సినిమాలు ఉన్నాయి. పాత్ర ప్రాధాన్యతకే తన ప్రయారిటీ ఇస్తూ నటిస్తున్నానని అనసూయ చెప్పుకొచ్చింది. తాను ఎలా చేసినా ఆడియన్స్ ను అలరించడానికే చేస్తున్నానని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ...
- Advertisement -
- Advertisement -