Naresh: సీనియర్ నరేష్ భరణం ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Naresh:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన ఎక్కువ వివాదాలు, వార్తల్లో ఉంటున్న్ సెలబ్రెటీల జాబితాలో సీనియర్ నటుడు నరేష్ పేరు టాప్ లో ఉంటోంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మలయాళ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవిత్రా లోకేష్ తో చట్టాపట్టాల్ వేసుకుంటూ తిరగడం, నరేష్ మూడో భార్య వారి మీద చెప్పుతో దాడికి దిగడంతో పెద్ద సెన్సేషన్ అయింది.

సూపర్ స్టార్ కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్ అతిగా చేయడం.. పవిత్రా లోకేష్ ని వచ్చిన అతిథులకు పరిచయం చెయ్యడం లాంటివి చాలామందికి నచ్చలేదు. అయితే కొత్త ఏడాది సందర్భంగా నరేష్, పవిత్రా లోకేష్ లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అది కూడా ఓ లిప్ కిస్ ద్వారా తాము త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలిపారు.

ఈనేపథ్యంలో నరేష్ మూడో భార్యతో ఎలా, ఎంతకు సెటిల్ చేసుకున్నాడనే విషయం మీద ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నరేష్ తన మూడో భార్యకు రూ.ఐదు కోట్ల భరణం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జనవరి నుండి నరేష్ తన మూడో భార్య నుండి విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా.. డిసెంబర్ లో వీరికి విడాకులు దొరికినట్లు తెలుస్తోంది.

నరేష్ కు తన తల్లి విజయనిర్మల ద్వారా భారీగా ఆస్తులు, డబ్బులు రాగా.. తాను కూడా బాగానే పోగేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నరేష్, నరేష్ తల్లి విజయ నిర్మలలు ఎక్కువగా భూముల విషయంలో పెట్టుబడి పెట్టగా.. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో ఇప్పుడు నరేష్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నరేష్ చాలా వ్యాపారాలు చేస్తుండగా.. వాటి ద్వారా కూడా కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నరేష్ కు రూ.5కోట్ల పెద్ద విషయం ఏమీ కాదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -