Krithi Shetty: కృతి శెట్టి వింత అలవాట్లు.. రాత్రైతే ఆ పని చేయాల్సిందేనట!!

Krithi Shetty: మనుషుల అలవాట్లు, కోరికలు ఎప్పటికీ ఒక్కలా ఉండవు. పరిస్థితులను బట్టి ఇష్టం, ప్రాంతాన్ని బట్టి ఆలోచనలు మారుతుంటాయి. అయితే ఈ అలవాట్లు కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉంటాయి. వింత అలవాట్లు, వింత పనులు చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. ఇలాంటి విచిత్రమైన అలవాట్లు సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఉంటుంది. అలాంటి కోవకు చెందినదే కృతిశెట్టి. అవును.. మీరు విన్నది నిజమే.. కృతిశెట్టికి కూడా కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి. అవేం అలవాట్లో ఒక్కసారి చూద్దామా..

 

కృతిశెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అతి తక్కువ సమయంలో లక్కీ హీరోయిన్‌గా అనిపించుకుంది. ఉప్పెన సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడంతో నిర్మాతలు కృతి డేట్స్ కోసం క్యూ కట్టారు. ఆమె చేసిన సినిమాలు వరుసగా మూడూ హిట్ అయ్యాయి. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు హిట్ టాక్‌తో దూసుకెళ్లాయి. అయితే వరుసగా సినిమాలు హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్‌గా ముద్ర పడిపోయింది. దీంతో వరుసగా ఆఫర్లు పెరిగాయి. అయితే రామ్, సుధీర్ బాబు హీరోలతో చేసిన సినిమాలు హిట్ టాక్ అందుకోలేకపోయి. దీంతో ఆమె కెరీర్ పూర్తిగా డైలమాలో పడినట్లు అయింది. కానీ ఆఫర్లు రావడం మాత్రం తగ్గలేదు.

 

వ్యక్తిగత విషయానికి వస్తే.. కృతిశెట్టికి విచిత్రమైన అలవాట్లు ఉన్నాయట. ఆమెకు ఇడ్లీలో బూస్ట్ వేసుకుని తినే అలవాటు ఉందని కృతిశెట్టి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పటికీ కార్టూన్ చూస్తుందట. ముఖ్యంగా ‘టామ్ అండ్ జెర్రీ’ సిరీస్‌ను ఎక్కువగా చూస్తానని ఆ భామ తెలిపింది. అలాగే పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటానని పేర్కొంది. అయితే మొదటి నుంచి కృతికి ఈ అలవాట్లు లేవని చెప్పింది. ఉప్పెన సినిమా షూటింగ్‌లో వైష్ణవ్ తేజ్‌ను చూసి హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుందట. అప్పటి నుంచి రోజూ బెడ్ పక్కనే హనుమాన్ చాలీసా పెట్టుకోవడం, పడుకునే ముందు చాలీసా చదవి పడుకోవడం అలవాటుగా మారిందట.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -