Star Heroes: స్టార్ హీరోల కంటే.. వారి భార్యల ఆదాయమే ఎక్కువట!!

Star Heroes: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కోట్లల్లో ఆదాయం సంపాదిస్తారు. తాము నటించబోయే సినిమాలు భారీ ఎత్తున రెమ్యునరేషన్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. దీంతో హీరోలు రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలకు పోటీగా వారి భార్యలు కూడా ఓ రేంజ్‌లో సంపాదిస్తున్న విషయం ఎవరికీ తెలియదు. ఆయా వ్యాపార రంగాల్లో రాణిస్తూ తమదైన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తున్నారు. వారెవరో ఒక్కసారి చూసేద్దామా..

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఒక పవర్‌ఫుల్ బిజినెస్ ఉమెన్. అపోలో హాస్పిటల్స్ వ్యాపారంలో తనదైన ముద్రను వేసుకుంది. రూ.కోట్లల్లో ఉన్న ఈ వ్యాపారాన్ని ముందుకు నడిపించేందుకు కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే సొంతంగా యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటకాలు చేయిస్తూ.. వాటి ప్రయోజనాలు చెబుతుంటారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను కూడా లాంఛ్ చేయనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ ఎదిగారు. రూ.కోట్లల్లో రెమ్యునరేషన్ ఆర్జించే అల్లు అర్జున్.. భార్య స్నేహా రెడ్డి కూడా వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. నిజానికి ఆమె ఇలాంటి విషయాలు ఎక్కువగా బయటపెట్టుకోరు. కానీ స్నేహా రెడ్డి తన తండ్రి ప్రభాకర్ రెడ్డి స్థాపించిన ‘సెయింట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి..

నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కూడా వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న స్వాతి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని రన్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన అన్ని సినిమాల వీఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం ఈ కంపెనీలోనే జరుగుతుంది.

 

మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డి..

మా అధ్యక్షుడు మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డి కూడా పలు వ్యాపారాలు చేస్తూ రూ.కోట్లల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఓ క్లాతింగ్ కంపెనీకి ఆమె యజమానురాలిగా ఉన్నారు. అలాగే డిజైనర్‌గా కూడా కొనసాగుతున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాకు డిజైనర్‌గా పని కూడా చేశారు. అలాగే ‘అందాల రాక్షసి’ సినిమా హీరో రాహుల్ భార్య సింగర్ చిన్మయి కూడా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్.. తన కంటే తన భార్యే ఎక్కువగా ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తుందని చెప్పుకొచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -