Charmy Kaur: ఛార్మీ ఎఫైర్ల గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Charmy Kaur: హీరోయిన్ ఛార్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె సినిమాల ద్వారా కన్నా ఎఫైర్ల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. అనుకోకుండా నటి అయిన చార్మి 14 ఏళ్ల వయసులో 2001లో విడుదలైన నీ తోడు కావాలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. అది అంతగా విజయం సాధించలేదు.

కాదల్ కిసు కిసు సినిమా ద్వారా తమిళ రంగంలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకుంది ఛార్మీ. దాంతో కాదల్ అళివతిళ్ళై, ఆహా, యత్న అలగు వంటి తమిళ చిత్రాల్లో అవకాశాలని దక్కించుకుంది అవి కూడా విజయాలు సాధించడంతో తెలుగు దర్శకుడు కృష్ణవంశీ దృష్టిలో పడింది.

 

శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా మళ్ళీ తెలుగు తెరకు పరిచయం చేశాడు కృష్ణవంశీ. ఆ తర్వాత ఆమె చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది కానీ స్టార్ హీరోయిన్ గా ఎక్కువకాలం నిలబడలేకపోయింది. ఈమె సాగించిన ఎఫైర్లు కూడా తక్కువేమీ కాదు. మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది ఛార్మీ.

అప్పట్లో వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయినట్లు కూడా వదంతులు వచ్చాయి. అయితే కారణాలు తెలియవు కానీ వారిద్దరి మధ్య దూరం పెరిగింది. తర్వాత ఆమె కృష్ణవంశీ తో కూడా అఫైర్లు నడిపినట్లు వార్తలు గుప్పుమన్నాయి. వాళ్ళిద్దరూ కూడా పార్టీలు పబ్బులు అంటూ చాలా కాలం ఎంజాయ్ చేశారు.

 

ఆ వ్యవహారం కూడా బెడిసి కొట్టడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ తో వ్యవహారం నడపడం మొదలుపెట్టింది ఛార్మీ. వాళ్ళిద్దరూ కలిపి సినిమాలు తీయడం ప్రారంభించారు. వీళ్ళ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ సినిమా జ్యోతిలక్ష్మి. అది అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఇద్దరు సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్పితే మిగిలినవి ఏవి చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాన్ని సాధించలేదు.

 

ఛార్మీ కారణంగానే పూరి జగన్నాథ్ తన భార్యకి దూరంగా ఉన్నాడని సినీ వర్గాల వారు చెప్తున్నారు. ఛార్మీ పూరి జగన్నాథ్ ఓకే ఇంట్లో ఉంటూ చాలా సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అయితే మేమిద్దరిని ఇప్పటికీ మంచి స్నేహితులమే అని చెప్పి జనాలని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు పూరి, ఛార్మీ.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -