Bigg Boss 6: బిగ్ బాస్ షో రన్నర్ గా నిలిచిందెవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Bigg Boss: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు చాలా వరకూ సక్సెస్ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని షోలు బుల్లితెరను శాశించే స్థాయికి చేరాయి. అలాంటి వాటిల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటనే చెప్పాలి. ఈ షో రియాల్టీ ఆధారంగా నడుస్తోంది. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. రేటింగ్ పరంగా కూడా ఇదే మొదటి స్థానంలో ఉంది. దీంతో నిర్వాహకులు పలు సీజన్లు నడుపుతూ వస్తున్నారు. దీంతో ఇటీవలె ఆరో సీజన్ కూడా సాగుతోంది. అయితే ఇందులో విజేతను నిర్ణయించే ఫినాలే వీక్ ఓటింగ్ వివరాలు తెలిసిపోయాయి.

 

ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఆరో సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ పోతున్నారు. దీంతో షో చరిత్రలో ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి చేరారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉండటం విశేషం. అయితే ఈ వారం మధ్యలో ఒకరు ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగ్ తెలిపారు. అందులో భాగంగా శ్రీ సత్య బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఇప్పుడు రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఫినాలేకు చేరుకున్నారు.

 

టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం ఎపిసోడ్ లో వివరాలను వెల్లడించారు. విజేతను నిర్ణయించే ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రసారం కానుంది.

 

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ మాత్రమే మొదటి నుంచి బాగా ఆడుతూ వస్తున్నాడు. దీంతో ఫినాలేలో అతనికే ఎక్కువ మార్కులు వచ్చాయని తెలుస్తోంది. ఈ సీజన్ లో రేవంత్ షో విజేతగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ కు పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. రన్నర్ విషయంలో చాలా చర్చ జరుగుతోంది. శ్రీహాన్ ఈ సీజన్‌లో రన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆది రెడ్డి మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, రోహిత్ ఐదో స్థానంలో నిలిచినట్లుగా సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -