Heer Achhra: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి హీర్ అచ్రా.. ప్రస్తుతం అందరి దృష్టిలో పడింది. కేవలం నటిగానే కాకుండా మోడల్ గా కూడా రాణించి మంచి పేరు సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే తనలో ఉన్న ప్రత్యేకతను బయటపెట్టింది. ఇక సినిమాలలోనే కాకుండా యాడ్స్ లలో కూడా అవకాశాలు అందుకుంటూ బాగా దూసుకుపోతుంది.
పైగా గుజరాతి సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పలు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో మాత్రం అందరి దర్శక నిర్మాతలు ఈమె పైనే కన్నేశారు. పైగా ఈమె పలు గ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే ఆమెన్ సన్ సిల్క్, నివియా, మియా జ్యువెలరీ వంటి బ్రాండ్లకు మోడల్ గా చేసింది.
బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ గుర్తింపుతోనే 2018లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈమె చేసే యాడ్స్, మోడలింగ్.. ఇతర వ్యవహారాలు అన్ని ముంబై కి చెందిన ప్రముఖ ఏజెన్సీ రన్ వే లైఫ్ స్టైల్ పర్యవేక్షిస్తుంది. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.