NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాళ్ల మాట అస్సలు వినడం లేదా?

NTR: టాలీవుడ్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తన నటనతో అందర్నీ కట్టిపడేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సూపర్ క్రేజ్ ను అందుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోల నటనకు సినీ అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు శంకర్ తో ఆయన ప్రాజెక్ట్ మొదలైంది.

 

అయితే ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత మరో సినిమా చేయనున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. తన తర్వాతి సినిమా కొరటాల శివతో అని ప్రకటించాక దాని నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ మొదలు కానే లేదు. కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొరటాల శివపై ప్రస్టేషన్ లో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కొరటాలపై ఫైర్ అవుతూ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ని ట్రోల్స్ చేస్తున్నారు.

 

తాజాగా ఇంకో విషయం ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా తర్వాత ఎటువంటి సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపడం లేదని వార్తలు షికారు చేస్తున్నాయి. ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి చాలా మంది దర్శకులు కథలు చెప్పడానికి వచ్చారట. కానీ వారందరికీ ఎన్టీఆర్ నో చెప్పినట్లు సమాచారం.

 

ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎన్టీఆర్ తన దృష్టి మొత్తం రాజకీయాల వైపు చూపనున్నారని, అందుకే ఆయన సినిమాల మీద ఆసక్తి చూపడం లేదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -