Young Tiger: తారక్‌కు కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండటానికి కారణాలివే!

Young Tiger: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్ ఉన్న అగ్ర హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఎవరి సాయం లేకుండా హీరోగా ఎదిగారు. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఊహించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘స్టూడెంట్ నంబర్.1, ఆది, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, యమదొంగ, అదుర్స్, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత’ వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఒకేసారి పాన్ ఇండియా స్టార్‌గా ఎన్టీఆర్ ఎదిగిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డిమాండ్ చూస్తూ రూ.100 కోట్లు కూడా పారితోషికం అందుకోగల ప్రతిభ ఉన్న నటుడు.

 

ప్రస్తుతం ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌కు బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్లు కూడా తనతో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్‌తో ఒక్క సినిమా అయినా తీసి రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్‌కు సంబంధించి కొన్ని విషయాల్లో ఫ్యాన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎన్టీఆర్‌కు ఏ ఈవెంట్‌లో పాల్గొన్న ఫ్యాన్స్ ను క్షేమంగా ఇంటికి వెళ్లమని చెప్తుంటారు.

 

 

దీంతో ఎన్టీఆర్‌కు సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్ పెరుగుతుంది. ఎన్టీఆర్ నటించిన సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోని వేసేవారు. అలాగే ఫ్లాఫ్ అయిన సినిమా డైరెక్టర్లకు కూడా ఛాన్సులు ఇస్తూ.. దర్శకులందరికీ ఫేవరేట్‌గా మారారు. మహిళలను గౌరవించడం, నెగిటివ్ ప్రచారాలకు దూరంగా ఉండటం తారక్ ప్రత్యేకం. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఎన్టీఆర్ ఎంతో సింపుల్‌గా ఉంటారు. నిజ జీవితంలోనూ ఫ్యాన్స్ కు అండగా ఉంటూ వారి మనసును గెలుచుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ రియల్ హీరోగా అనిపించుకున్న తారక్ మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలా తనదైన శైలిలో అభిమాన గణాన్ని సంపాదించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -