Youtube Sree: వేడుకగా యూట్యూబర్ పెళ్లి.. రూ.4 కోట్ల కట్నకానుకలిచ్చిన సబ్ స్క్రైబర్లు

Youtube Sree: ఇప్పుడంతా యూట్యూబ్ కాలం నడుస్తోంది. వంటలు, వినోదం, వేడుకలు, ఇలాంటివెన్నో కావాలన్నా యూట్యూబ్ ను ఓపెన్ చేయాల్సిందే. చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి వరకూ కూడా యూట్యూబ్ చూడందే ఉండలేని పరిస్థితి వచ్చేసింది. చాలా మందికి ఇదొక ఆదాయ వనరుగా కూడా మారిపోయింది. అంతేకాదు ప్రపంచంలోని చాలా మంది యూట్యూబ్ ద్వారా బంధువులుగా కూడా మారిపోతున్నారు. తాజాగా ఇప్పుడు క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్ అన యూట్యూబ్ ఛానెల్ పేరు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ చానెల్ ఓనర్ శ్రీ. అందరూ సురేశ్ ను శ్రీ అని ముద్దుగా పిలుచుకుంటారు.

 

సురేశ్ కొన్ని రోజులకు ముందు మౌనిక (అన్విక) అనే అమ్మాయిని పెళ్లాడాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ శ్రీ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చాడు. తన పెళ్లి వేడుకను వీడియో రూపంలో తీసి ఛానెల్ పోస్టు చేయడంతో అందరూ ఆశీర్వదిస్తున్నారు. తన పెళ్లికి కట్న, కానుకలు ఇచ్చేవారు అందించండి అంటూ అందర్నీ శ్రీ ఓపెన్ గా కోరాడు.

 

ఆయన పిలుపుతో ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. శ్రీ పిలుపుతో చానెల్ సబ్ స్క్రైబర్లు ఇప్పటి వరకూ కూడా అక్షరాలా రూ.4.47 కోట్లు అందించారు. ఈ విషయాన్ని శ్రీనే స్వయంగా తెలియజేశాడు. ఇప్పటి వరకూ తన 23,301 మంది సబ్ స్క్రైబర్లు తన పెళ్లికి కానుకలు ఇచ్చారని, వారందరికీ శ్రీ ధన్యవాదాలు తెలిపాడు.

 

తన పెళ్లికి సంబంధించి కట్నాలు పంపాలని కోరిన శ్రీ..అవి ఎలా పంపించాలో కూడా తెలియజేశాడు. తన పెళ్లికి ఎంత మొత్తంలో కట్నం పంపిస్తారో, ఏయే గిఫ్టులు ఇస్తారో కామెంట్లతో తెలుపమన్నాడు. అలా కామెంట్లలో అందరూ రాసిన కట్నం మొత్తం కలిపి రూ.4,37,87,213గా ఉంది. మరో విషయం ఏంటంటే తాను పెళ్లి చేసుకున్న అన్విక (మౌనిక) తల్లిదండ్రుల నుంచి శ్రీ కట్నకానుకలు చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు. పెళ్లి కూడా సాదాసీదాగా ఓ గుడిలో చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గతంలో తన యూట్యూబ్ ఛానెల్ లో పనిచేసే మిత్రుడికి కారును గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. డబ్బుకన్నా విలువలు, అభిమానానికే శ్రీ ఎక్కువ గౌరవం ఇస్తాడని మరోసారి రుజువైంది.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -