YS Sharmila: వైరల్ అవుతున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగా ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకుంది.అధికార పక్షాలు ప్రతిపక్షా నాయకులు వచ్చే ఎన్నికలలో మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో టిడిపి,వైసిపి మధ్య గట్టి పోటీ ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు.కానీ వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గారిని చిత్తుచిత్తు ఓడిస్తామంటూ ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి పార్టీలు పెద్ద ఎత్తున శపదాలు చేస్తున్నాయి.

ఇవన్నీ ఇలా ఉండగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన విషయం మనకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా ఉన్నటువంటి షర్మిల తాజాగా వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి పీఠం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల బరిలో ఎవరో ఒకరే గెలుస్తారు ఒకరే సీఎం అవుతారు ఆ ఒక్కరు నేనే అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

వచ్చే ఎన్నికలలో కేసీఆర్ పక్కా ఓడిపోతారని తప్పకుండా తన పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ షర్మిల ధీమా వ్యక్తం చేశారు.ఈరోజు నేను చెబుతున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలిచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ ధీమా వ్యక్తంచేశారు.కెసిఆర్ గారి అవినీతి పాలన ప్రతి ఒక్కరు చూస్తున్నారని కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ షర్మిల ఈ సందర్భంగా మాట్లాడారు.

 

ప్రత్యేక తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సంపాదించుకోవడం కాదు వచ్చిన ఆ తెలంగాణను కాపాడుకోవడం కూడా ముఖ్యమని ఈమె తెలియజేశారు. ఈసారి కెసిఆర్ తప్పకుండా ఓడిపోతారని షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి షర్మిల రాజకీయాలలో చాలా చురుగ్గా ఉన్నారు. మరి షర్మిల చాలెంజ్ చేసిన విధంగానే వచ్చే ఎన్నికలలో అధికారం అందుకుంటారా లేదా తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -