YS Sharmila: కాంగ్రెస్ గెలుపు అక్కర్లేదు.. వైసీపీ ఓడితే చాలు.. షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఆదరణ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు పీకల వరకు కోపం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత జరిగే రెండు ఎన్నికల్లోను కాంగ్రెస్ ని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఏపీ ప్రజలు. ఈ తరుణంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో పునర్వైభవం తెచ్చే ప్రయత్నంలో చురుగ్గా వ్యవహరిస్తుంది.

అలా అని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూర్చునే అవకాశం లేదని ఆమెకి కూడా తెలుసు. అయితే ఇప్పుడు తన ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ గెలవకపోయినా పర్వాలేదు కానీ వైసీపీ ఓట్లను చీల్చి ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే వైసీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ వస్తుంది.

వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఓటర్లు కాకుండా కొంతమంది తటస్థమైన ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అయితే వారు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో ఆ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోగలిగితే వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుందనే వ్యూహంతో ఉన్నారు షర్మిల. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలీజా, చిట్టిబాబు, ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరి పోటీకి సిద్ధమయ్యారు. ఒక 40 స్థానాల్లో బలమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది.

వీరు గెలవకపోయినా వైసీపీ ఓట్లు చీలుతాయనే ఉద్దేశ్యంతోనే వాళ్ళని ప్రత్యర్థుల స్థానంలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గాల్లో 15 వేల ఓట్లు వరకు సంపాదించినా అది వైసీపీ అభ్యర్థులకు గట్టి దెబ్బనే ఇస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ వ్యూహం ఏ పార్టీకి ఎంత నష్టం గా మారింది అన్నది తేలుతుంది. మరి షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల రిజల్ట్స్ రావాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -