YS Sharmila: ఎట్టకేలకు బయటపడ్డ అసలు బంధం.. చెల్లికి అండగా జగన్?

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన ఈమెను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న అన్న జగన్ హైదరాబాద్ కు వచ్చి చెల్లిని కాపాడుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు విషయం ఏంటంటే..

 

గతంలో వైఎస్ షర్మిల, ముఖ్యమంత్రి జగన్ మధ్య రాజకీయ విభేదాలు రావడంతో షర్మిల తెలంగాణకి చేరుకొని గత ఏడాది కొత్త పార్టీని ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి తెలంగాణలో బాగా ప్రచారం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటూ హైదరాబాదులో సెటిల్ అయింది షర్మిల.

 

అయితే ప్రస్తుతం ఆమె వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో టీఆర్ఎస్, వైఎస్ఆర్ పార్టీల మధ్య వాగ్వాదం ఏర్పడింది. షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకోగా వెంటనే షర్మిల, తమ పార్టీ కార్యకర్తలు వారిపై ఆగ్రహంతో ప్రగతి భవన్ దగ్గరికి వెళ్లారు. ఇక షర్మిల స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లగా.. అక్కడ పోలీసులు తనని అడ్డుకున్నారు.

 

అంతేకాకుండా తనను బలవంతంగా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు. దీంతో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోగా వెంటనే పోలీసులు షర్మిల కారును క్రేన్ ద్వారా పట్టుకొని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తర్వాత ఆమెను స్టేషన్లోకి బలవంతంగా తీసుకెళ్లారు. స్టేషన్లో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అంతేకాకుండా తమపై అలా ప్రవర్తించినందుకు ఫైర్ అయ్యింది. ఇక ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారటంతో వెంటనే తన అన్న జగన్ చెల్లిని కలిసేందుకు హైదరాబాద్ కు వస్తున్నట్లు తమ పార్టీ నేతలు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -