YS Sharmila: KTRకి కౌంటర్ ఇచ్చిన వైయస్ షర్మిల.. ఇంతకీ ఏం చెప్పిందంటే?

YS Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ప్రస్తుత సీఎం వైయస్ జగన్ సోదరి అయిన వైయస్ షర్మిల YSR తెలంగాణ పార్టీ పేరుతో ఓ పార్టీని నెలకొల్పడం తెలిసిందే .గతకొంతకాలంగా ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను, ఇబ్బందులను తెలుసుకుంటూ ఉన్నారు.

 

 

అయితే వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం మీద టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గతంలోనే ఆమె మీద, ఆమె పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. వైయస్ షర్మిల పార్టీాని తెలంగాణలో ఏర్పాటు చేయడం గురించి కామెంట్ చేశాడు. దానికి తాజాగా వైయస్ షర్మిల సమాధానమిచ్చారు.

 

 

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు నాకు మా అన్న మీద కోపం ఉంటే AP లో పార్టీ పెట్టాలి గాని తెలంగాణ లో పెట్టడం ఎందుకు’ అని KTR అన్నారు. దీనికి వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమాధానమిచ్చారు.

 

 

కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిచ్చిన వైయస్ షర్మిల.. ‘అయ్యా ఆ ఇంకిత జ్ఞానం నాకూడా ఉంది. నాకు మా అన్న మీద కోపం లేదు కాబట్టి అక్కడ పార్టీ పెట్టకుండా ఇక్కడ పెట్టాను’ అని అన్నారు. కాగా వైయస్ జగన్ కు, వైయస్ షర్మిలకు చెడిందనే, అందుకే ఆమె ఏపీ వదిలి తెలంగాణకు వచ్చి రాజకీయ పార్టీ స్థాపించినట్లు వార్తలు రావడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -