Hindupur: బాలయ్యకు పోటీగా.. హిందూపురంలో ఆమెను బరిలోకి దింపనున్న జగన్?

Hindupur: హిందూపురం పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు నటసింహం నందమూరి బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా రెండోసారి ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో బాలయ్య గెలుపొందారు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే హిందూపురం ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. షూటింగ్ లు లేని సమయంలో పూర్తిగా హిందూపురం నియోజకవర్గానికి పరిమితమవుతున్నారు. నియోజవర్గంలో పర్యటిస్తూ నేతలు, కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తనవంతు శ్రమిస్తున్నారు.

తన సొంత డబ్బులతో నియోజకవర్గంలో డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నారు బాలయ్య. అయితే వచ్చే ఎన్నికల్లో 175కి 175 నియోజకవకర్గాల్లో గెలుపొందాలనే లక్ష్యతో సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందులో టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంపై కన్నేశారు. హిందూపురం అనగానే టీడీపీకి కంచుకోట అని ఎవరైనా చెబుతారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా బాలయ్య ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. ఆ తర్వాత అదే నియోజకవర్గం హరికృష్ణ ఒకసారి పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో హిందూపురానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టీడీపీ ఇక్కడ బలంగా ఉంది. అయితే ఈ సారి టీడీపీకి కంచుకోటను బద్దలు కొట్టాలనే ఉద్దేశంలో వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. మహిళా అభ్యర్ధి అయితే ఓట్లు పడే అవకాశముందటనే అంచనాకు జగన్ వచ్చారు.

దీంతో మంత్రి ఉషాశ్రీచరన్ ను బాలయ్యకు పోటీగా రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం కల్యాణదుర్గం నుంచి ఆమె ప్రతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బరిలోకి దిగేలా సిద్దంగా ఉండాలని ఉషాశ్రీచరణ్ కు జగన్ చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. 1995లో మినహా హిందుపురం నియోజకవర్గంలో మహిళలు ఎవరూ పోటీ చేయలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉషాశ్రీచరణ్ ను బరిలోకి దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -