YSRCP Leader: మహిళను మంటల్లోకి తోసేసిన వైసీపీ నేత.. ఈ నాయకుడు చేసిన పనికి షాకవ్వాల్సిందే!

YSRCP Leader: ఇంటి పక్కన కాలి స్థలం విషయంలో ఓ వైసిపి నాయకుడు మహిళతో గొడవకు దిగి ఏకంగా ఆమెను మంటలలోకి తోసేసిన ఘటన గాజువాకలో చోటుచేసుకుంది. ఇలా మంటలలో పడినటువంటి ఆమె తీవ్రమైనటువంటి గాయాలు పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూ పోర్ట్ సిఐ దాలి బాబు తెలిపిన వివరాల మేరకు.. గాజువాక 65వ వార్డు బానోజీ తోటలో రాధ అనే మహిళ నివసిస్తూ ఉన్నారు.

ఇలా ఈమె నివసిస్తున్నటువంటి ఇంటి పక్కనే కాస్త ఖాళీ స్థలం ఉంది అయితే ఈ కాలి స్థలంలో కంపచెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే స్థానిక వైకాపా నాయకుడు లోకనాథం అక్కడికి వచ్చే ఆ చెట్ల అన్నింటిని నరికి వేసి అగ్గి పెట్టాడు. ఇలా ఆచెట్లను నరకడంతో రాధ అతనితో వాగ్వాదానికి చోటుచేసుకుంది నా ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలం నాకు చెందినదని తను ఎలా వచ్చి ఆక్రమించుకుంటాడని ఆమె ప్రశ్నించారు.

ఈ విధంగా రాదా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రాధ పై లోకనాథం చేయి చేసుకోవడమే కాకుండా ఆమెను తోసేయడంతో మంటల్లో పడ్డారు ఇలా మంటల్లో పడినటువంటి ఆమె ముఖానికి చేతివేళ్ళకు అంత తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. అయితే గత కొద్ది రోజులకు ఈ స్థలం విషయంలో ఇద్దరు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని తెలుస్తుంది.

ఇలా ఈ ప్రమాదం జరగడంతో రాదా స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు కానీ లోకనాథం మాత్రం ఆ ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ లేనని ఆమె గత కొద్దిరోజులుగా నాపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అందులో భాగంగానే ఇలా చేశారు అంటూ మాట మారుస్తున్నారు కానీ పోలీసులు మాత్రమే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -