Andhra Pradesh: వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ చేసింది ఎవరో తెలిస్తే ఛీ అంటారు!

Andhra Pradesh: వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడే వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చివారో.. ఎవరికీ అంతగా తెలియని వారు ఉంటారు. పనులు చేయలేక సోమరితనంలో దొంగతనాలకు పాల్పడుతుంటారు. కానీ.. ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసును దొంగిలించిన వ్యక్తి ఎవరో తెలిస్తే అవకైతారు. వైయస్సార్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ గాంధీనగర్‌ లోని ఓ అపార్టుమెంట్లో ఒంటరిగా ఉంటున్న మస్తానమ్మ అనే వృద్ధు్ధరాలి మెడలోని మూడున్నర సవర్ణ బంగారు గొలుసు గురువారం చోరీకి గుౖరైంది. నగర పంచాయతీ పరిధి. గాంధీనగర్లోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న మస్తానమ్మ మెడలోని బంగారు గొలుసును స్థానిక శాంతినగర్‌ కు చెందిన బెల్లం అనిల్‌ కుమార్‌ రెడ్డి దొంగిలించాడని స్థానిక సీఐ కోటేశ్వర్‌ రావు వెల్లడించారు.

దొంగిలించిన వ్యక్తి వైకాపా నాయకుడని నగర పంచాయతీలో తాత్కాలిక ప్రాతిపదికన శానిటరీ పర్యవేక్షకుడిగా పనిచేసే మానేశాడు. ఆటో యూనియన్‌ అధ్యక్షుడిగానూ పని చేశాడు. అతని భార్య వాలంటీర్ కావడంతో ఆమె పింఛన్లు ఇచ్చే సమయంలో తోడుగా వెళ్లేవాడు. ఆ సమయంలో పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు ఉండటం గమనించి గురువారం చోరీకి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించి అరెస్టు చేశారు. రాజకీయ నాయకులు కూడా దొంగతనాలకు పాల్పడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -