TDP: మేనిఫెస్టో తర్వాత మారిన పరిస్థితులు.. టీడీపీలోకి ఆ నాయకులంతా క్యూ కడుతున్నారా?

TDP: ఏపీ ఎన్నికల సమరం మరొక పది రోజులలో ముగియనుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే రెండు పార్టీ అధినేతలు ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయిన తర్వాత పెద్ద ఎత్తున పార్టీలలో చేరికలు వలసలు ఎక్కువగా అయ్యాయని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత కూటమి విజయం ఖాయమని తెలిసినటువంటి ఎంతోమంది వైసిపి ద్వితీయ శ్రేణులు టిడిపిలోకి చేరుతున్నారు. లోకేష్ చంద్రబాబు నాయుడు సమక్షంలో అని మాత్రమే కాకుండా స్థానిక నాయకుల సమక్షంలో ఎంతో మంది ద్వితీయ శ్రేణి వైసిపి నాయకులు టిడిపిలోకి వలసలు వెళ్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలన ఏమాత్రం నచ్చక ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో కచ్చితంగా కూటమి గెలుస్తుందని ధీమా అందరిలోనూ నెలకొంది అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని భావించిన ఎంతోమంది ఎన్నికలకు ముందే టిడిపి పార్టీలోకి చేరుతున్నారు.

ఇక చాలాచోట్ల నేరుగా టిడిపి పార్టీలోకి వెళ్లలేక పోయిన చాలామంది వైసిపి తరఫునే ఉంటూ మద్దతు మాత్రం తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభించడంతో గెలుపు ఖాయమైందని, వచ్చేది కూటమి అంటూ ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -