Y.S Sharmila: సంచలనంగా మారిన షర్మిల ఢిల్లీ టూర్.. వైఎస్ వివేకా కేసుతో లింకు ఉందా?

Y.S Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీ టూర్‌కు వెళ్లనుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అక్టోబర్ 21న షర్మిల ఢిల్లీ టూర్‌కు పయనమవ్వనున్నారు. అక్టోబర్ మొదటివారంలో ఢిల్లీ వెళ్లిన షర్మిల… ఇదే నెలలో రెండోసారి హస్తిన టూర్‌కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ హైకోర్టు నుంచి బదిలీ చేస్తూ సీబీఐ పిటిషన్ వేసిన క్రమంలో.. షర్మిల ఢిల్లీ టూర్ కు వెళుతుండటం పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ నెల మొదటివారంలో ఢిల్లీ వెళ్లిన షర్మిల.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వంలో భారీ అవినీతి జరుగుతోందని, చర్యలు తీసుకోవాల్సిందిగా షర్మిల కోరారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుుందని సీబీఐ కార్యాలయానికి వెళ్లి షర్మిల ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వైఎస్ వివేకా హత్య కేసుపై వివరాలు అందించేందుకు సీబీఐ డైరెక్టర్ ను కలిశారనే ప్రచారం జోరుగా జరిగింది. వైఎస్ వివేకా హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ర ెడ్డిల పాత్ర ఉందని సీబీకి షర్మిల చెప్పినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టడం దుమారం రేపింది.

సీబీఐు స్టేట్ మెంట్ ఇచ్చేందుకే షర్మిల ఢిల్లీ వెళ్లారని బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాియి. ఇప్పుడు వివేకా హత్య కేసును ఏపీ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాల హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో షర్మిల మళ్లీ ఢిల్లీ టూర్ కు వెళుతుండం హాట్ టాపిక్ గా మారింది. మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై ఈడీకి లేదా జలశక్తిశాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నారనే టాక్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసుపై మరోసారి సీబీఐను కలుస్తారని రాజకీయ వర్గాల్లో రకరకరాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తన అన్న జగన్ తో విబేధించిన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చిచెండాడేస్తున్నారు. కేసీఆర్ పై ఆమె చేసినంతగా ఎవరూ అంత ఘాటు వ్యాఖ్యలు చేయడం లేదు. దమ్ముంటే తనను జైల్లో పెట్టండి చూద్దాం అంటూ కేసీఆర్ సర్కార్ కు సవాల్ కూడా చేశారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ పర్యటనలో షర్మిల కలకలం రేపుతోన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై కేంద్ర పెద్దలకు, సీబీఐకు షర్మిల ఫిర్యాదు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుుతన్నాయి. మరి ఈ సారి ఢిల్లీ టూర్ తో షర్మిల ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారు.. ఏం ఏం చేస్తారు.. ఎవరిపై ఫిర్యాదు చేస్తారనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -