Yuvraj Singh: యువీకి షాకిచ్చిన గోవా ప్రభుత్వం.. అనుమతి లేకుండా అది ఎలా నిర్వహిస్తారంటూ నోటీసులు..

Yuvraj Singh: టీమిండియా డబుల్ వరల్డ్ కప్ విన్నర్, మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు గోవా పర్యటక శాఖ షాకిచ్చింది. అధికారుల నుంచి అనుమతి లేకుండా యువీ చేస్తున్న పనికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. సెలబ్రిటీ అయినా ఎవరైనా నిబంధనలను పాటించాల్సిందేనని హెచ్చరించినట్టు సమాచారం. తమ అనుమతి లేకుండా యువీ చేసిన పని తప్పే అని నోటీసులు ఇస్తూ వచ్చే నెల వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 

అసలేం జరిగిందంటే..

యువరాజ్ సింగ్ గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో ఓ విల్లాను కొన్నాడు. ఆ విల్లాకు ‘కాసా సింగ్’ అని పేరు కూడా పెట్టాడు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో యువీ.. అక్కడకు వచ్చే గెస్టులకు అద్దెకు ఇవ్వనున్నట్టు ట్విటర్ లో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా అందులో పేర్కొన్నాడు. ఇదే యువీ కొంపముంచింది.

 

అనుమతుల్లేవ్..

గెస్ట్ ల కోసం యువీ తన విల్లాను అద్దెకు ఆన్లైన్ లో పెట్టడం వివాదానికి దారితీసింది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం.. గోవాలో పెయింగ్ గెస్ట్ అవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ యువీ మాత్రం అటువంటి అనుమతులు ఏమీ తీసుకోకుండానే ఆన్లైన్ లో బుకింగ్ వివరాలు పెట్టడం వివాదానికి కారణమైంది. దీంతో రాష్ట్ర పర్యాటక శాఖ యువీకి నోటీసులిచ్చింది. డిసెంబర్ 8న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నందున యువరాజ్ పై జరిమానా (సుమారు లక్ష రూపాయలు) ఎందుకు విధించకూడదో కూడా వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది. ఇందుకు గాను యువీ గతంలో చేసిన ట్వీట్ ను కూడా నోటీసులో పేర్కొంది. మరి దీనికి యువీ ఎటువంటి సమాధానం చెబుతాడో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -