YV Subba Reddy: వైసీపీలో చేతులు దులిపేసుకున్న వైవీ సుబ్బారెడ్డి.. వాళ్లు అసలు అభ్యర్థులే కాదంటూ?

YV Subba Reddy: వైయస్సార్సీపి పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి వారిలో వైవి సుబ్బారెడ్డి ఒకరు. ఈయన పార్టీలో ఎంతో చురుగ్గా ఉంటూ పార్టీకి ఎలాంటి మేలు చేశారో తెలియదు కానీ ఈయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పార్టీకి మాత్రం భారీగా డామేజ్ అవుతుందని చెప్పాలి. ఈయన తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అర్థం కాదు కానీ ఈయన చేసే వ్యాఖ్యలు పార్టీకి ఎంతో ఇబ్బందికరంగా మారాయి.

మొన్నటికి మొన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మరో రెండు సంవత్సరాల పాటు హైదరాబాద్ నే తమ రాజధానిగా ఉండాలని కోరుతున్నారని ఈ విషయంపై కేంద్రానికి జగన్ లేక రాయబోతున్నారంటూ చెప్పారు. ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. వై వి సుబ్బారెడ్డి మాటలకు వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి ఆ ఉద్దేశం లేదని మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకోవచ్చు.

ఇక త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే కొంతమంది పేర్లను జగన్మోహన్ రెడ్డి తెలియచేసిన సంగతి తెలిసిందే. ఇలా పార్టీ సమన్వయకర్తల గురించి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వాళ్లంతా అసలు అభ్యర్థులే కారని ఎన్నికలకు వారం ముందు మరో జాబితాను విడుదల చేస్తారని వారి అసలైన అభ్యర్థులు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇప్పుడు నిలబడినటువంటి అభ్యర్థులు నిరుత్సాహం వ్యక్తం చేశారు.

ఇక తాజాగా మరోసారి ఈయన ధర్మాన ప్రసాద్ గురించి మాట్లాడుతూ ఆయన శ్రీకాకుళంలో తన భూములను కాజేయడం కోసమే వచ్చారని చెప్పారు. దీంతో ప్రజలలో కూడా చర్చలు మొదలయ్యాయి వైసీపీకి ఓటు వేస్తే తమ భూములకు భద్రత ఉండదని గ్రహించారు. ఇలా ఎన్నికల సమయంలో వై వి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -