Odisha: భార్యను మంత్రాలతో రప్పిస్తానన్న మాంత్రికుడు.. రాకపోవడంతో కోపంతో..

Odisha: ఒప్పుడు అంతా టెక్నాలజీ లేకపోవడంతో మంత్రాలు, తంత్రాలు నమ్మేవారు. నేటి కాలంలో ఎంతో అద్భుతమైన టెక్నాలజీ దూసుకుపోతోంది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు నమ్మి కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు. మరి కొందరైతే మంత్రాలను నమ్మి ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడటం లేదు. మంత్రాలను నమ్మిన ఓ వ్యక్తి అవి సఫలీకృతం కాకపోవడంతో మాంత్రికుడినే దారుణంగా హత్య చేసిన ఘటన ఒరిస్సాలోని జాజ్‌పూర్‌లో జిల్లాలో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒరిస్సా, జాజ్‌పూర్‌ జిల్లాలోని బంధగావ్‌ గ్రామానికి చెందిన శాంతను బెహ్ర భార్య కొన్ని నెలల క్రితం అతడితో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు అత్తారింటికి పోయిన శాంతను భార్యను ఒప్పించి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం చాలా సార్లు చేశాడు. అయినా భార్య రాలేదు. ఎంత నచ్చచెప్పినా భార్య రానని తెగేసి చెప్పింది.

దీంతో చేసేది లేక అతడు ఇంటికి వచ్చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన భార్యను ఎలాగైనా ఇంటికి రప్పించుకోవాలని నిర్ణయించుకున్న శాంతను, మనియా బాబర్‌ అనే మాంత్రికుడిని కలిశాడు. ఆ మాంత్రికుడు శాంతను భార్యను తనకున్న మంత్రశక్తులతో పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చేలా చేస్తానని అందుకోసం తనకు రూ. 5 వేల ఇవ్వాలని కోరగా అతను ఏమాత్రం ఆలోచించకుండా మాంత్రికుడు అడిగిన డబ్బులు శాంతను ఇచ్చేశాడు. మాంత్రికుడు చెప్పిన రోజులు గడిచిపోయాయి. అయినా శాంతను భార్య ఇంకా ఇంటికి రాలేదు. భార్య ఇంటికి రాకపోవడంతో శాంతను మాంత్రికుడిపై విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు.

తన దగ్గర నుంచి రూ. 5 వేలు తీసుకున్నా తన పని చేయడం లేదని భావించాడు. ఓ రోజు మధ్యాహ్నం మాంత్రికుడి ఇంటికి వెళ్లిన శాంతను అతనితో ఇదే విషయమై గొడవపడ్డాడు. తన పని కాలేదని తన డబ్బులు వాపస్‌ ఇవ్వాలని మాంత్రికుడిని అడగడంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శాంతను పదునైన ఆయుధంతో మాంత్రికుడిని దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం స్వచ్ఛందంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తాను మాంత్రికుడిని హత్య చేశానని పోలీసులతో చెప్పడంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -