RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించుకున్నప్పటికీ ఎన్నికల అఫీడవిట్ లో ఎలాంటి ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించుకోలేదని తెలియపరిచారు. ఈ విషయంపై టిడిపి నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇలా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈయన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని అందరూ భావించారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో పద్మావతి మాత్రం నానికి మద్దతుగా నిలవడమే కాకుండా ఆయన నామినేషన్ కు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఈమె పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది.

ఈ విధంగా ఆర్డిఓ పద్మావతి ఏకపక్షంగా వ్యవహరించాలని ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈమె పేరు సంచలనంగా మారింది అసలు ఈమె ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.కొడాలి నానినే పద్మావతికి గుడివాడలో పోస్టింగ్ ఇప్పించారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. అందుకే ఇలా నానిపై స్వామి భక్తి ప్రదర్శిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

కేవలం నామినేషన్ విషయంలో ఏకపక్షంగా ప్రవర్తించడమే కాకుండా ఈమె పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసిపికి ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. పైగా తాను నామినేషన్ పత్రాలపై సంతకం చేయకముందే ఫిర్యాదులు చెప్పాలి అంటూ ఉచిత సలహాలను కూడా ఇస్తున్నారు. ఇలా ఒక ఏకపక్షంగా ఉంటూ ఒకే పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి ఈమె పట్ల ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -