Aftab Confession: శ్రద్ధను 35 ముక్కలుగా నేనే నరికి చంపాను.. కసాయి అఫ్తాబ్‌ సంచలన వాంగ్మూలం!

Aftab Confession: ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్‌ హత్య కేసు పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రియురాలిని నిందితుడు అఫ్తాబ్‌ అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అక్కడితే ఆగకుండా ఫ్రిజ్‌లో శ్రద్ధ డెడ్‌బాడీ ముక్కలను ఉంచి రోజుకొకటి చొప్పున ఎవరూ లేని ప్రదేశంలో పడేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన దేశ ప్రజలు అఫ్తాబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తర్వాత అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు కస్టడీలో అఫ్తాబ్‌ అనేక కీలక విషయాలు వెల్లడించాడు. తాజాగా శ్రద్ధ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలాకు పోలీసులు నార్కోటెస్ట్‌ చేశారు. ఇందులో అఫ్తాబ్‌ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు చెప్పాడని తెలుస్తోంది.

బ్రేకప్‌ చెప్పింది.. అందుకే ఇలా చేశా..
శ్రద్ధ తనకు బ్రేకప్‌ చెప్పిందని, వెళ్లిపోతానని బెదిరించిందంటూ అఫ్తాబ్‌ చెప్పాడు. తనను విడిచి వేరొకరితో వెళ్లిపోతుందేమోనని అనుమానంతోనే శ్రద్ధను హత్య చేశానని అఫ్తాబ్‌ ఒప్పుకున్నాడు. ఈ కోపంతోనే ఆమెను 35 ముక్కలుగా నరికానని అంగీరించాడు. ఈ మేరకు అతడు నార్కో టెస్ట్‌లో ఒప్పుకున్నాడని ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందుతోంది.

అందులో చెప్పిన సమాధానాలే ఇక్కడ కూడా..
ఇదివరకే నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అందులో చెప్పిన సమాధానాలే ఇప్పుడు నార్కో టెస్ట్‌లోనూ చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రద్ధను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధంపై పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చాడు. శ్రద్ధ వేసుకున్న దుస్తులు, ఆమె దుస్తులు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -