CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు డ్రామా చేసినటువంటి ఈయన ఈసారి గులకరాయి అంటూ పెద్ద ఎత్తున సరికొత్త డ్రామాకి తెర లేపారు. విజయవాడ బస్సు యాత్రలో భాగంగా ఈయనపై గులకరాయి దాడి జరిగింది. అయితే ఈ దాడిలో భాగంగా ఈ వెనక అనుబొమ్మపై చిన్నపాటి కాయమైంది అయితే అప్పటికే డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి చిన్న స్టిక్కర్ వేశారు.

ఇక దీనినే అవకాశం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి 10 లో సంఖ్యలో డాక్టర్ల సమక్షంలో ఆ భాగానికి కుట్లు వేయించుకొని పెద్దబ్యాండ్ ఎయిడ్ వేశారు. బహుశా పెద్ద ఎత్తున సర్జరీ జరిగిన ఆ సర్జరీ జరిగిన వారం పది రోజులలోపు కుట్లు తీసేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి తగిలిన చిన్న గాయానికి పెద్ద ఎత్తున బ్యాండ్ ఎయిడ్ వేసి సింపతి డ్రామాలు చేయడం మొదలుపెట్టారు.

ఇక ఈ గాయం తగిలి దాదాపు 20 రోజులు అవుతున్న ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాండ్ ఎయిడ్ తీయకపోవడంతో భారీ స్థాయిలో ఏపీలో ట్రోల్స్ జరుగుతున్నాయి. అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగానే పలువురు బ్యాండ్ ఎయిడ్ వేసుకుని ఆయనని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఆ బ్యాండేజ్ తీయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తీరా ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఆ బ్యాండ్ ఎయిడ్ తో జగన్మోహన్ రెడ్డి సింపతి డ్రామాలు ప్లే చేస్తారేమో అందుకే ఇప్పటివరకు దానిని తొలగించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ చూసి అయిన జగన్ బ్యాండ్ ఎయిడ్ తీసేస్తారా లేకపోతే అలాగే కొనసాగిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -