CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతో హుందాగా నడుచుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి మహిళల పట్ల చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈయన ఏ సభకు వెళ్లిన మహిళలను కించపరుస్తూ మాట్లాడనిదే తిరుగు పయనం కారు.

ముఖ్యంగా తనకు మైకు కనపడితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన పెళ్ళాల గురించి మాట్లాడుతారు ముగ్గురు భార్యలని, ముగ్గురికి విడాకులు ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతారు అదేవిధంగా ఇటీవల కాలంలో తన చెల్లెలు సునీత షర్మిల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో మెట్టు కిందికి దిగి తన సొంత చెల్లెలిపై ఆమె కట్టుకున్న చీరపై జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసి మరింత దిగజారిపోయారని చెప్పాలి.

ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి భారీ సభలో అవినాష్ గురించి ఈయన మాట్లాడుతూ తన చెల్లిపై విమర్శలు చేశారు పచ్చ చీర కట్టుకొని వైఎస్సార్ కి శత్రువులు అయినటువంటి వారి వద్దకు వెళ్లి వారి ముందు మోకరిల్లి శత్రువులతో చేతులు కలిపినటువంటి వారు వైయస్ వారసుల అంటూ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ప్రశ్నించారు. ఇలా చెల్లెలు ఒంటిపై ఉన్నటువంటి చీరను గమనించి ఇలా సభలో మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇలా ఇప్పటివరకు మహిళల గురించి నీచంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి వారు ఏ రంగు చీర కట్టుకున్నారనే విషయాలను కూడా గమనించి విమర్శలు చేస్తున్నారు అంటే ఈయన స్థాయి ఎక్కడికి దిగజారిపోయిందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాజకీయాలలోకి రావాలనుకునే మహిళలు కూడా వెనుకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఈయన ఇకపై అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానితే బాగుంటుంది.

పసుపు రంగు చీర కట్టుకున్న వారు పసుపు రంగు దుస్తులు ధరించిన వారందరూ కూడా టిడిపి పార్టీ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కనుక వస్తే పచ్చ రంగును బ్యాన్ చేస్తారేమో అంటూ పలువురు ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -