Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పేర్లను పోలి ఉన్నటువంటి వారు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయటం అందరిని ఓకింత ఆందోళనకు గురించేస్తుంది.

ఇకపోతే ఏపీ రాష్ట్ర రాజకీయాలంతా ఒకవైపు ఉంటే పిఠాపురం రాజకీయం మాత్రం ఒకవైపు ఉందని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ను ఏ విధంగా అయినా ఓడించాలన్న విధంగా అక్కడ వైసిపి పనిచేస్తుంది ఇప్పటికే ప్రతి మండలానికి పెద్ద ఎత్తున మంత్రులను ఇన్చార్జులుగా జగన్మోహన్ రెడ్డి నియమించారు.

ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసీపీ పని చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం వైసిపి మరో కుట్రకు తెరలేపిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పేరుతో మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ నామినేషన్ వేయడంతో అక్కడ ప్రజలలో ఆందోళన నెలకొంది. కొణిదెల పవన్ కళ్యాణ్ కి పోటీగా కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

ఇక వీరిద్దరి గుర్తులు కూడా అచ్చ పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు గుర్తుని పోలి ఉండటంతో జనసేన అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. వయసు పైబడిన వారు గ్లాసు గుర్తు విషయంలో కన్ఫ్యూజన్ అవుతూ స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే పెద్ద ఎత్తున నష్టం వస్తుందని చెప్పాలి. ఇలా పవన్ కళ్యాణ్ ను ఓడించడం కోసం వైసిపి ఇలాంటి కుట్రకు తెరలేపిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు అంటే అక్కడ వైసిపి ఓటమిని అంగీకరించిందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -