Burning Incense: ఇంట్లో త‌ర‌చూ గుగ్గిలంతో ధూపం వేస్తే దేవుని అనుగ్రహం కలుగుతుందా.. ఆ సమస్యలు దూరమవుతాయా?

Burning Incense: మాములుగా హిందువులు కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు భగవంతున్ని ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. అయితే పూజ చేసిన తర్వాత ధూపం వేయడం అన్నది తప్పనిసరి. ధూపం వేయడం ఎప్పటి నుండో ఉంది. అగరబత్తుల సుగంధం లేకుండా పూజ ఏదీ కూడా ముగిసిపోదు. ధూపం వేయడం చాలా మంచిది. మనసుకి కూడా ప్రశాంతతని ఇస్తుంది. ఇంటి వాతావరణాన్ని కూడా స్వచ్ఛంగా మార్చేస్తుంది. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. హిందూ గ్రంథాలలో ధూపానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదు.

ధూపం వేసే వస్తువులను బట్టి కూడా వేరువేరు ప్రయోజనాలని మనం పొందవచ్చు. ధూపం వేస్తే వ్యాధుల నుండి విముక్తి కూడా పొందవచ్చు. ధూపం వేయడం వలన ఆరోగ్యపరంగానే కాదు. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. గుగ్గిలం ధూపంని చాలామంది రోజూ ఇంట్లో వేస్తూ ఉంటారు. గురువారం రోజు కచ్చితంగా గుగ్గిలం ధూపం వేయాలి. గుగ్గిలం వాసన మెదడులో నొప్పి, అలాగే దానికి సంబంధించిన వ్యాధుల్ని తొలగిస్తుంది.

అలాగే గుండె నొప్పిని కూడా నివారించగలదు. ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన కలహాలు ఏమీ కూడా రావు. గుగ్గిలం ధూపం వేస్తే అతీంద్రియ లేదంటే దైవిక శక్తులని ఆకర్షిస్తుంది. ఇలా గుగ్గిలంతో ధూపం వేయడం వలన మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. గుగ్గిలం ధూపం భూగోళానికి శాంతిని ఇస్తుంది. వాస్తు దోషాలని తొలగిస్తుంది. ప్రశాంతతనిస్తుంది. ఇలా గుగ్గిలం ధూపంతో చాలా లాభాలు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -