Business: మహిళలకు శుభవార్త.. ఆ స్కీమ్ ద్వారా రూ.3 లక్షల లోన్!

Business: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. సంక్షేమ పథకాలతో పాటు చేయూత అందించేందుకు అనేక స్కీమ్ లు ప్రవేశపెడుతూ ఉంటాయి. సంక్షేమ పథకాల గురించి అందరికీ తెలుస్తుంది. కానీ ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ ఉంటుంది. వాటి గురించి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అలాంటి పథకాలు చాలానే ఉన్నాయి.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీరిదిద్దేందుకు, వ్యాపారాల్లో వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఉద్యోగిని అనే పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి మహిళలకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తుంది. ఈ డబ్బుల ద్వారా మహిళలు తమకు నచ్చిన వ్యాపారం మొదలుపెట్టవచ్చు.

బ్లూటీ ప్లారర్, క్యాంటీన్, క్యాటరింగ్, కాఫీ, టీ పౌడర్ తయారీ, అగర్ బత్తీ తాయారీ లాంటి 86 రకాల వ్యాపారాలకు కొన్ని సంస్దలతో కలిసి ప్రభుత్వ శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే కేంద్రం వడ్డీ లేని రుణం అందిస్తుంది. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఈ లోన్ పొందవచ్చు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1,50,000లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటే లోన్ ఇవ్వరు. అయిేతే మహిళలు వితంతువు, వికలాంగులు అయితే వారికి ఈ నిబంధన అవసరం లేకుండా వడ్డీ లేరి రుణం అందజేస్తారు. ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://udyogini.org/ వెబ్ సైట్ చూడవచ్చు. ఈ పథకం ద్వారా 30 శాతం వరకు సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని తమ వ్యాపారాలను ప్రారంభించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -