CM Jagan: షర్మిల నెత్తిన పాలు పోస్తున్న వైఎస్ జగన్.. ఎంత విమర్శలు చేస్తే అంత మేలా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందులలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో భాగంగా వైఎస్ వారసులు ఎవరో తేల్చుకోవాలంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైయస్ షర్మిల సునీత రెడ్డి వివేక హత్య కేసులో భాగంగా ప్రచార కార్యక్రమాలలో తరచూ జగన్మోహన్ రెడ్డి అవినాష్ పేర్లను ప్రస్తావించారు.

అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ.. పసుపు చీర కట్టుకొని ప్రతిపక్షత నేతల ముందు మోకరిల్లారు అంటూ జగన్మోహన్ రెడ్డి షర్మిల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటంతో సొంత చెల్లెలిపై ఇలా మాట్లాడటం ఏంటి అని సాక్షాత్తు వైసిపి అభిమానులు కూడా దిక్కులు చూశారు.

ఇలా తన అన్నయ్య బహిరంగ సభలో తన గురించి తన ఒంటిపై ఉన్నటువంటి చీర రంగు గురించి మాట్లాడటంతో షర్మిల కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఇప్పటివరకు ఎంతో సహనంతో ఉన్నటువంటి షర్మిల ఊహించని విధంగా కొన్ని విషయాలను బయటపెట్టారు సిబిఐ చార్జిషీట్ లో వైయస్ పేరును జగనే పెట్టించారనే విషయాన్ని ఈమె బయట పెట్టారు.

మొత్తానికి వైయస్ షర్మిల పట్ల జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు తన స్థాయిని కాస్త తగ్గించాయనే చెప్పాలి దీంతో వైఎస్ షర్మిల స్థాయి కూడా మరో మెట్టు ఎదిగిందని ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం షర్మిలను సొంత చెల్లెలి అని కూడా చూడకుండా అనరానీ మాటలు అంటూ ఉంటే అవి షర్మిలకే అనుకూలంగా మారుతాయని ఈయన ఎంత విమర్శలు చేస్తే తన చెల్లికి అంత లాభమే తప్ప నష్టం ఉండదని చెప్పాలి. మొత్తానికి వైయస్ వారసుల మధ్య ఈ విధమైనటువంటి రాజకీయ పోటీని ఎవరు ఊహించలేదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -