KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈయన ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా రిపోర్టర్ నుంచి ఈయనకు ఒక ప్రశ్న ఎదురైంది ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కెసిఆర్ సమాధానం చెబుతూ ఏపీలో ఏ పార్టీ వచ్చినా మాకు పెద్దగా ఎలాంటి పట్టింపులు లేవని తెలిపారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మళ్లీ ఏపీలో సీఎం గెలుస్తారని తెలిపారు. ఎవరు గెలిచినా మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇకపోతే గతంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలలో పనిచేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కేసిఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.

ఈ క్రమంలోనే మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అంటూ ఈయన తన మనసులో మాటను చెప్పారు. అయితే జగన్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా అలా చెప్పారని అనుకుంటే పొరపాటేనని చెప్పాలి. తొమ్మిది సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ కు వివిధ వ్యవస్థలతో తనకు ఎంతో మంచి పరిచయాలు ఉంటాయి అయితే ఈ పరిచయాల కారణంగానే ఏపీలో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -