Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది పేరు. శ్రీకాకుళం జిల్లాకి ఆర్థికంగా ఆయువు పట్టులాంటి ఆ నియోజకవర్గంలో రాజకీయంగా ఏం జరుగుతుందో చూద్దాం. పరిశ్రమలు, విద్యా కేంద్రాలు పుష్కలంగా ఉన్న ఎచ్చెర్ల లో ఒకవైపు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంటే మరొకవైపు పొడవైన జాతీయ రహదారితో జిల్లా ఆర్థిక కేంద్రంగా మారింది.

అంతేకాకుండా నియోజకవర్గం పరిధిలోని రణస్థలం పారిశ్రామికవాడలో ఎన్నో ఫార్మా పరిశ్రమల వల్ల ఉపాధి కోసం ఇతర ప్రాంతాల వారు వచ్చి స్థిరపడ్డారు.రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉండటంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం పార్టీలో శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2, 42,918 ఓట్లు ఉన్నాయి. తూర్పు కాపు సామాజిక వర్గం ఓటర్లు మొదటి స్థానంలో ఉండగా రెడ్డి, కలింగ, మత్స్యకారులు సామాజిక వర్గాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.

అలాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి తెదేపా తప్పుకొని బీజేపీకి ఈ నియోజకవర్గ కేటాయించడంతో రాజకీయంగా ఇక్కడ తీవ్ర ఉత్కంఠత నెలకొంది. నిజానికి మొన్నటి వరకు వైసీపీ, టీడీపీల్లో గ్రూప్ వారు తీవ్ర స్థాయిలో ఉండేది. సిట్టింగ్ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా రోడ్డుకి ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే అనూహ్యంగా ఇప్పుడు రెండు పార్టీల్లోని అసంతృప్తులు టీ కప్పులో తుఫాన్ లా చల్లారిపోయాయి. గత ఎన్నికలలో వైసీపీ తొలిసారి గెలిచిన ఎచ్చెర్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తీవ్రవ్యతిరేకత ఎదుర్కొన్నారు. అయినప్పటికీ బొత్సకు ప్రధాన అనుచరుడైన కిరణ్ కుమార్ కి అధిష్టానం అండదండలు ఉండటంతో మరోమారు టికెట్ తెచ్చుకున్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావు బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -