Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మరొక రెండు వారాలలో ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తికానుంది.

ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కూటమి అభ్యర్థులు మరోవైపు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా కూటమి సభ్యులు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన గురించి ప్రశ్నిస్తున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ఈయన రాజధాని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంపై మాట కూడా మాట్లాడటం లేదు పరిశ్రమలు తీసుకురాలేదు.

నిరుద్యోగ రేటు పెరిగిపోయింది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలా వీటన్నింటి గురించి ప్రశ్నిస్తే జగన్ వద్ద కూడా సమాధానం లేదనే చెప్పాలి .అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం సంక్షేమ పథకాలను అందిస్తూ సంక్షేమ పథకాలను అందించాను ఈసారి కూడా ఓట్లు వేయండి అంటూ అడుగుతున్నారు.

కానీ కూటమి అభ్యర్థులు మాత్రం చాలా తెలివిగా తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి వైసిపికి భారీ దెబ్బ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పాలి. తాను ప్రచార కార్యక్రమాలకు వెళ్తే పోలవరం ప్రాజెక్ట్ ఉద్యోగ అవకాశాలు ఇలాంటి ప్రశ్నలు ఎదురయితాయని భావించి ఈయన డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపారు.

ఈ క్రమంలోనే గులకరాయి దాడి ఘటన ఒకటి అలాగే తన చెల్లెలు పసుపు రంగు చీర కట్టుకొని శత్రువుల వద్దకు వెళ్ళింది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్లు రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులపాటు చర్చలకు కారణమయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన గురించి ఎవరు మాట్లాడుకోకుండా ఈ విషయాల గురించి ఆలోచించేలా పాలిటిక్స్ మొత్తం డైవర్ట్ చేశారని చెప్పాలి. కానీ లోకేష్ పవన్ చంద్రబాబు మాత్రం జగన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నిలదీసి ప్రశ్నిస్తూ జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ కొనాలి అంటే స్టాంపు పేపర్ లో కాకుండా కేవలం జిరాక్స్ పేపర్లు మాత్రమే అందిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడంతో ప్రజలందరూ కూడా ఈ విషయంపై ఆలోచన చేస్తున్నారు అయితే ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి కాస్త ఆందోళనకరంగానే ఉందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -