CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. షర్మిల అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి ని ఓడించి అతనికి మద్దతుగా నిలుస్తున్న జగన్ కి బుద్ధి చెప్పాలని షర్మిల కోరుకుంటుంది. అయితే జగన్ వర్గం ఆమెకి గట్టిగానే పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ సందర్భంగానే ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే తరఫున జగన్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షర్మిల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చెల్లెలి గురించి మాట్లాడిన జగన్ ఆమె డిపాజిట్ కోల్పోబోతుందని ఇది తనకు ఎంతో బాధ కలిగించే విషయమని, ఆమె పోటీ చేస్తున్న పార్టీ అటువంటిదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీయే తనమీద తన చెల్లి చేత తప్పుడు కేసులు పెట్టించిందని విమర్శించారు.

ఆ పార్టీని చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి షర్మిల ని తప్పు తోవ పట్టించి తన మీదకి ఉసిగొల్పుతున్నారని పేర్కొన్నారు. షర్మిల వెళుతున్న దారి సరియైనది కాదని, తనపై అక్రమ కేసులు పెట్టి వేధించి తన తండ్రి వైయస్సార్ పేరుని చార్జిషీట్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీతో కలిసి వైఎస్ షర్మిల నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఉందని, అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరటం పోటీ చేయటం తనకు బాధను కలిగించిందన్నారు. ఎన్నికల ముందు తనను ఓడించడానికి అందరూ ఏకమయ్యారని, అందరి లక్ష్యం తనను ఓడించడమేనని, ఎవరు ఏకమైనా ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారన్నారు. ఈ విషయంపై షర్మిల, కూటమి వర్గం వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -