Lakhamandal Temple: చనిపోయిన వాళ్లను మళ్లీ బ్రతికించే దేవాలయం.. ఈ గుడి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Lakhamandal Temple: మనిషికి ప్రాణం అంటే ఎంత తీపో అందరికీ తెలిసిందే, అలాంటి ప్రాణాన్ని తిరిగి ఇచ్చే గుడి ఒకటి ఉంది అంటే నిజంగా నమ్మశక్యం కాని విషయం. కానీ ఉత్తరాఖండ్ లోని ఉన్న ఒక శివాలయం ఒక మనిషిని కొన్ని నిమిషాల పాటు తిరిగి బ్రతికిస్తుంది. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉంటాడని ప్రతీతి. ఇంతకీ ఆ గుడి ఏమిటి? ఎక్కడ ఉంది? అనే విషయానికి వస్తే గుడి పేరు లక్ మందిర్ దేవాలయం.

ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో చంసేర్ బావర్ అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే చక్రత నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళవచ్చు. ఈ ఆలయం చక్రత నుంచి 100 కిలోమీటర్లు, డెహ్రాడూన్ నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గుడిని చూసినప్పుడు భూమండలం మీద సనాతన సంప్రదాయాలు, సంస్కృతి గల భారతదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు, మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి అనటానికి నిదర్శనం అనిపిస్తుంది.

పాండవులు మహాభారత యుద్ధ సమయంలో ఇక్కడ ఒక లక్క ఇంట్లో నివాసం ఉన్నారని, అదే ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశం అని స్థానికుల కథనం. ఈ ఆలయం ద్వాపరయుగం నుంచే విశిష్టతని కలిగి ఉన్న ఆలయం. ఈ గుడిలోని అభిషేకజలంతో చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించవచ్చు . ఇక్కడ పరమశివుని లింగాకారం గ్రానైట్ తయారు చేశారు. దాని ప్రకాశానికి ఆ చుట్టుపక్కల అందంగా కనిపిస్తుంది.

ఈ స్వామి యొక్క అత్యంత మహిమ వలన స్వామిని అభిషేకించిన జలాన్ని చనిపోయిన వారికి పట్టిస్తే కొన్ని ఘడియలు బ్రతుకుతారని ఇక్కడి వారి నమ్మకం. అలాగే ఇక్కడ ఆలయానికి ప్రవేశ ద్వారం వద్ద ఇరువైపులా మానవ దానవ విగ్రహాలు ఉంటాయి. స్థానికులు వీటిని భీముడు, అర్జునుడు అని నమ్ముతారు. కానీ ఈ విగ్రహాలు రెండు వైకుంఠ ద్వారానికి ఇరువైపులా ఉండే జయ విజయులుగా చరిత్ర చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశం మహిమాన్వితవైన దేశం అని ఇలాంటి ఆలయాలు చాటి చెప్తాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -