Chandrababu-CM Jagan: చంద్రబాబు పని అయిపోయిందా.. జగన్ ను తక్కువగా చేసి తప్పు చేశారా?

Chandrababu-CM Jagan: ఏపీ సీఎం జగన్ మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల మధ్య పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గు మంటుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూ చిటపటలాడుతూ ఉంటారు. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ బాబు పై ఏ విధంగా అయితే విమర్శలు చేశారో ఇప్పుడు బాబు కూడా జగన్ పై అదే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో బాబు జగన్మోహన్ రెడ్డి విషయంలో కాస్త అశ్రద్ధగా, తక్కువ అంచనా వేయడంతో నేడు బాబుకి ఈ పరిస్థితి వచ్చింది అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2019లో మోసపూరితంగానే సీఎం అయ్యారు అన్న వాదనలు వినిపిస్తూనే ఉన్న విష తెలిసిందే. ఇప్పటికీ టిడిపి నేతలు అదే విషయాన్ని ఎద్దేవా చేస్తూనేఊ ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాడని గతంలో చంద్రబాబు అంచనా వేశారు. అప్పట్లో అలా అంచనా వేయడమే చంద్రబాబు ఈ పరిస్థితికి కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ను తక్కువగా అంచనా వేయకుండా ఉండి ఉంటే చంద్రబాబు పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల విషయానికొస్తే.. వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరగడంతో ఒకవైపు టీడీపీ మరొకవైపు వైసిపి ఎలా అయినా గెలవాలి అన్న కసితో ఉన్నాయి. ఈ నేపథంలోనే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అయినా టిడిపి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సీఎం జగన్ మాత్రం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది మరింత కూల్ గా ఉంటూ వచ్చే ఏడాది తామే గెలుస్తాము అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల హస్త్రాలను ఉపయోగిస్తూ ప్రజలను గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -