TTD Temple: శ్రీవారికి 108 బంగారు పుష్పాలను విరాళంగా ఇచ్చిన లలిత జ్యువలరీ ఎండీ.. విలువ ఎంతంటే?

TTD Temple:  లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బంగారు నగల వ్యాపార సంస్థలను ప్రారంభించి ఈయన వ్యాపార రంగంలో ఎంతో దూసుకుపోతున్నారు. ఇలా తమ నగల వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేయడమే తన లక్ష్యం అంటూ ఇదివరకు ఈయన పలు సందర్భాలలో తెలియజేశారు. ఇప్పటివరకు 51 షో రూమ్లను ప్రారంభించినటువంటి కిరణ్ కుమార్ తన వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపించడమే తన లక్ష్యమని తెలిపారు.

ఇకపోతే వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అంటే ఎంతో మంది సెలబ్రిటీలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు కానీ కిరణ్ కుమార్ మాత్రం సొంతంగా తన వ్యాపార ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. డబ్బులు ఊరికే రావు అనే ఒక డైలాగ్ తోనే ఈయన ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ విధంగా వ్యాపార రంగంలో ఎంతో ముందుకు కొనసాగుతున్నటువంటి కిరణ్ కుమార్ తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఏకంగా 108 బంగారు పుష్పాలను విరాళంగా అందించారు.

కడపకు చెందిన రాజారెడ్డి అనే ఒక డాక్టర్ స్వామివారికి విరాళంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నారట అయితే ఆ పుష్పాలను లలిత జ్యువలరీ వారి ఆధ్వర్యంలో తయారు చేయించి స్వామివారికి విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి కిరణ్ కుమార్ స్వామి వారికి 108 బంగారు పుష్పాలను విరాళంగా ఇచ్చారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కడపకు చెందిన డాక్టర్ తమకు విరాళం ఇచ్చారు అయితే దానితో మేము స్వామి వారికి ఆరు నెలల పాటు ప్రత్యేకంగా ఈ పుష్పాలను తయారు చేయడం కోసం సమయం కేటాయించి ఎంతో అద్భుతంగా ఈ పుష్పాలను తయారు చేసి స్వామివారికి విరాళంగా ప్రకటించామని తెలియజేశారు. ఇక ఆలయ ప్రాంగణంలో కూడా తన ఫేమస్ డైలాగ్ డబ్బులు ఊరికే రావు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -